రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్
ఆదివాసీ మహిళపై దాడి చేసిన షేక్ ముగ్దుమ్ ను వెంటనే ప్రభుత్వం ఉరి శిక్ష పడేలా చేర్యలు తీసుకోవాలి
బెజ్జుర్ మండల ఆదివాసీ కొలవార్ మన్నెవార్ సేవా సంఘం నాయకులు
న్యూస్తెలుగు/ కొమరం భీం/ ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జుర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ఆదివాసీ కొలవార్ మన్నెవార్ సేవా సంఘం ఆధ్వర్యంలో తుడుం దెబ్బ పిలుపు మేరకు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఆదివాసీ కొలవార్ మన్నెవార్ నాయకులు మాట్లాడుతూ జైనూర్ మండలానికి చెందిన ఆదివాసీ మహిళా మెస్రం నిలబాయి గారిపై జరిగిన అత్యాచారం మరియు అత్యయత్నం అత్యంత దారుణమైన సంఘటన అని ఈ దాడికి కారకుడైన షేక్ ముగ్దుమ్ ను SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట పరంగా అతడికి చిక్షపడేలా ప్రభుత్వం చేర్యలు చీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. దాడికి గురైన ఆదివాసీ మహిళా మెస్రం నిలబాయి గారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మరియు ఆదివాసీ చట్టాలను పక్కడబందిగా అమలు చేయాలనీ వీటికి నిరసనగా రేపు బెజ్జుర్
మండల బంద్ కు ఆదివాసీ కొలవార్ మన్నెవార్ సేవా సంఘం పిలుపునిచ్చారు. దీనికి అన్ని రకాల వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ కు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. (Story : రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్)