మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “మీకు తెలుసా” ఐఇసి క్యాంపెయిన్ కార్యక్రమం
న్యూస్‌తెలుగు/ కందుకూరు : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశముల మేరకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ డ్యాప్క్యు లీడ్ ఎన్జీవో – మదర్ ల్యాండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కందుకూరు మండలం మాచవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు “మీకు తెలుసా?” అని హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మదర్ ల్యాండ్ సొసైటీ స్వచ్చంద సంస్థ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూర్చి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఏక్ట్ 2017, ఎ ఆర్ టి మందులు,ఎ పి సాక్స్ యాప్ , టోల్ ఫ్రీ నెంబర్ 1097 గూర్చి విద్యార్థిని, విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. మాల్యాద్రి ఉపాధ్యాయులు కె.రామారావు,వి కమలాకర్ మదర్ ల్యాండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ ఆర్ శ్రీనివాసరావు మరియు సంస్థ సిబ్బంది పాల్గొనడం జరిగింది. (Story : మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “మీకు తెలుసా” ఐఇసి క్యాంపెయిన్ కార్యక్రమం)