ప్రభుత్వ కార్యాలయ దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన
న్యూస్‌తెలుగు /విజయవాడ : ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాల భద్రతపై ప్రత్యేక తృష్టి పెట్టాలని, దస్త్రాలు దగ్ధం, మాయం చేస్తే క్రిమినల్ చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ.సృజన అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఉద్యోగుల బదిలీల్లో ప్రభుత్వ నిబందనలను ఖచ్చితంగా పాటించాలని గ్రీవెన్స్ రీఓపెన్‌కు అస్కారం లేకుండా అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ ఇటీవల మదనపల్లి, తిరుపతి, పోలవరం ప్రభుత్వ కార్యాలయాల్లో దస్త్రాల దగ్దం సరుఘటనలు దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు ఆప్రమత్తతో కార్యాలయ పర్యవేక్షణ చేయాలన్నారు. కార్యాలయాల్లో ఫైర్ సేప్టీ, విద్యుత్ సరఫరా పరికరాలపై ఆడిటింగ్ నిర్వహించి సంబందిత అదికారుల నుంచి దృవీకరణ పత్రం పొందాలన్నారు. ప్రతి కార్యాలయంలో సీసీ కెమారాలు ఏర్పాటు చేసి రాత్రి గస్టీకి వాచ్‌మెన్‌ను నియమించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో గడువు ముగిసే వరకు నిరీక్షించకుండా ఆయా ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు సమర్పించి ఆమోదం పొందాలని ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలతని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల్లో న్యాయస్థానాల కేసులకు కౌంటర్ దాఖలు చేసేందుకు పూర్తి సమాచారంతో ముందస్తుగా దస్త్రాలను సమర్పించాలన్నారు. జిల్లాలో త్వరలో నిర్వహించనున్న రెవిన్యూ సదస్సుల నిర్వాహణకు ముందస్తు ప్రణాళికలను రూపొందించాలన్నారు. సదస్సులో నమోదయ్యే ప్రతిఅర్జీ రిజస్టర్‌చేయాలన్నారు. స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలకు శాస్వత పరిష్కారం చూపటంపై దృష్టిపెట్టి రీఓపెన్‌కు అవకాశం లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ డా.నిదిమీనా, అసిస్టెంట్ కలెక్టర్ శుభంకుమార్, డీఆర్వో శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, డీటీసీ పురేంద్ర, డ్యామా, హౌసింగ్, ఐసీడీఎస్ పీడీలు సునీత, రజనీకుమారి, ఉమాదేవి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ కార్యాలయ దస్త్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి)