ఘనంగా రాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి నివాళ్లు అర్పించిన
జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్
న్యూస్‌తెలుగు /ములుగు : ములుగు జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం డి చంద్ పాషా ఆధ్వర్యంలో భారత రత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిధిగా, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి,కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ
ఐరన్ లేడీ అఫ్ ఇండియా దివంగత ప్రధాన మంత్రి స్వర్గీయ ఇందిరమ్మ మూడవ కుమారుడు రాజీవ్ గాంధీ,1984 అక్టోబర్ 31 న తల్లి మరణం తో ఉత్తర ప్రదేశ్ నుండి అమేది లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 1981 లో పోటీ చేసి ఎన్నిక అయ్యారు .తల్లి మరణం తో కాంగ్రెస్ పార్టీ తన భుజస్కంధాలపై వేసుకొని, 1984 లో దేశ భవిష్యత్తు కోసం 40 సంవత్సరాల వయసులోనే భారతదేశ ప్రధానమంత్రిగా అతిపిన్న వయసుకుడు చరిత్రలోకి ఎక్కారు, తదుపరి ఎన్నికలలో అత్యధిక స్థానాలలో అత్యధిక మెజారిటీ మెజారిటీని సాధించి రెండవసారి ప్రధానమంత్రి అయ్యారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వo లో ఆధునీకరణ, ఉదారికరణ పై దృష్టి సారించి, మొదటిసారిగా కంప్యూటర్లు,టెలి కమ్యూనికేషన్ వంటి రంగాలలో ఆయన అనేక ముఖ్యమైన సంస్కరణ ప్రవేశపెట్టాడని తెలిపారు. పలు అంశాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమం లో
కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి,జడ్పీటీసీ నామకారం చంద్ గాంధీ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లు నల్లెల భారత్, బండి శ్రీను వారితో పాటు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, మండల్ నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా రాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకలు)