సోదరీమణులచే రాఖీ కట్టించుకొన్న మాజీ మంత్రి
ఆడపడుచులందరికి రాఖిపండుగ శుభాకాంక్షలు
న్యూస్‌తెలుగు / వనపర్తి : రాఖీ పూర్ణిమ సందర్భంగా తన స్వగ్రామం పాన్ గల్ నందు నిరంజన్ రెడ్డి తన సోదరీమణులు అనసూయమ్మ, సుదర్శనమ్మ,బాలకిష్టమ్మ,శేషిరేఖమ్మ గార్లచేత రాఖీలు కట్టించుకొని అక్కలకు పాదనమస్కారం చేసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదర సోదరీమణుల ప్రేమ అనురాగం ఆత్మీయతలకు ప్రతీక రాఖీ పండుగ అని అన్నారు. అనుక్షణం సోదరున్ని క్షేమం కోరుకునే వారు తోబుట్టువులు అని అన్నారు. నియోజకవర్గ సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. (Story : సోదరీమణులచే రాఖీ కట్టించుకొన్న మాజీ మంత్రి)