జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ,ఖదర్ పాష
న్యూస్‌తెలుగు / వనపర్తి : వనపర్తి జిల్లాలో ప్రభుత్వం నిబంధనలు తుంగలో తొక్కి, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలకు కొమ్ముకాస్తూ, వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పాఠశాల విద్య శాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖల జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన వనపర్తి పట్టణంలో మంగళవారం విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష మాట్లాడుతూ, ప్రభుత్వం సెకండ్ సాటర్డే కూడా సెలవుదినం కొన్ని పార్లమెంటు హాలిడేస్ కూడా సందర్భంగా విద్యాసంస్థలకి సైతం సెలవు ప్రకటించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసిన, జిల్లాలోని కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు దినాన్ని ప్రకటించకుండా, తరగతులు నిర్వహిస్తూ, విద్యార్థులను, బోధన, బోధనేతర సిబ్బందిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ, ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సెలవు దినాల్లో సైతం ఇష్టారాజ్యంగా తరగతులు నిర్వహించడాన్ని జన సమితి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలు సెలవు దినాల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ సదరు ప్రైవేటు కళాశాల యజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరించడం సిగ్గుచేటు ఆని అన్నారు. జిల్లాలో పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు స్పందించి, సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల, కళాశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. (Story : జిల్లా విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి)