‘గ్లైకోపైర్రోలేట్’కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం
న్యూస్‌తెలుగు / హైదరాబాద్: నరాల సంబంధిత సమస్యలతో ఉన్న వారు నోరూరడంలో తలెత్తే ఇబ్బందులకు ఉపయోగించే గ్లైకోపైర్రోలేట్ ఓరల్ సొల్యూషన్‌కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) ఆమోదం లభించిందని గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. ఇది రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్ అన్నారు. ఇది ఓరల్ సొల్యూషన్ 1 ఎంజీ/5 ఎంఎల్ కలవన్నారు. ఇది మూడు నుంచి పదహారేళ్ళ వయస్సు గల రోగులకు సూచించే యాంటికోలినెర్జిక్ మందు అన్నారు. అమెరికా మార్కెట్‌లో గ్రాన్యూల్స్ బలోపేతం అవుతుందన్నారు. ఈ ఆమోదం దృఢమైన నాణ్యతా ప్రమాణాలకు నిదర్శనమన్నారు.(Story:‘గ్లైకోపైర్రోలేట్’కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం)