సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
ఏపి యూ డబ్ల్యూ జే 67 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : విజయనగరం సమాజం లో జర్న లిస్టు ల పాత్ర కీలకం అని, నిరంతరం పని చేస్తున్న జర్నలిస్టు లో సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ని కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస రావు తెలిపారు. ఎపీయూడబ్లుజె 67వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఐ ఎం ఎ హాలు లో శనివారం జరిగాయి . ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోనే పలు సంక్షేమ పథకాలు అమలు జరిగాయని గుర్తు చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామన్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ గత పాలకులు విధానాలు వలన ఇబ్బందులు పడిన ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తీరు మంచి పరిణామం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందీ అంటే ఫోర్త్ ఎస్టేట్ విలువ లతో పనిచేయడం వల్ల అని కొనియాడారు.జర్నలిస్టు ల సమస్యలు పరిష్కారం కోసం తన తోడ్పాటు ఉంటుంది అని తెలిపారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ పాలకులు, ప్రజాప్రతినిధులు జర్నలిస్టుల కోసం నిరంతరం పని చేసే విధంగా సంఘం చొరవ తీసుకోవాలని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఉండే లా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే తామే ప్పుడూ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించలేదు అన్నారు. శాసనసభ సభ్యులు అదితి గజపతి రాజు, లోకం మాధవి, తోయక జగదీశ్వరి లు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వర్కింగ్ జర్నలిస్టుల నిరంతరం పాటు పడుతున్నా రని అన్నారు.ప్రభుత్వానికి , ప్రజలకి వారది లా పనిచేస్తున్నారని అన్నారు. సమస్యల పై ఆలుపెరగని పోరాటం : ఎపీయూ డబ్యూజే రాష్ర్టఅధ్యక్షులు ఐవి సుబ్బారావు. జర్నలిస్టుల సమస్యలపై ఏపీయూ డ బ్ల్యూజే ఆలు పెరగని పోరాటం చేస్తుందని రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తెలిపారు. జర్నలిస్టుల పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, చతిస్త్ గడ్ లో తెచ్చిన రక్షణ చట్టం దేశ వ్యాప్తంగా అమలు చేయాలనీ, జర్నలిస్టుల సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 38 రద్దు చేసి అందరికీ ఆక్రిడేషన్ మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యల పై దశల వారి పోరాటాలు చేపడతామన్నారు. రాష్ర్ట ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ మాట్లాడుతూ 67 ఏళ్ళుగా జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కృషి చేస్తోందని అన్నారు. . సర్ సివై చింతామణి కి నివాళులు: స్థానిక ప్రెస్ క్లబ్ వద్ద ఉన్న సర్ సి వై చింతామణి విగ్రహానికి రాష్ర్ట మంత్రి గుమ్మడి సంధ్యా రాణి పూల దండ వేసి నివాళులు అర్పించారు. యునియన్ పతాకా విష్కరణ: ఏపి యూ డబ్ల్యూజే పతాకా విష్కరణ రాష్ర్ట అధ్యక్షులు ఐవి సుబ్బారావు చేతులమీదుగా జరిపారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఏడీ రమేష్ , రాష్ర్ట నాయకులు పి ఎస్ ఎస్ వి ప్రసాద్, జిల్లా నాయకులు ఎం ఎస్ ఎన్ రాజు,రాధా కృష్ణ, మహాపాత్రో, పంచాది అప్పారావు, , వై ఎస్ పంతులు, బి.డేవిడ్ రాజు, లింగాల నరసింగరావు , ఐ ఎం ఎ రాష్ట్ర అధ్యక్షులు జేసీ నాయుడు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డా.,అశోక్, శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు కొల్లూరు జగన్నాధ శర్మ,కార్యదర్శి సముద్రాల నాగరాజులతో పాటు, జిల్లాలో ఉన్న వివిధ చిన్న మధ్యతరహా పత్రికలకు సంబంధించిన పాత్రికేయులు,కొల్లూరు తిరుమలెశ్వరరావు,మంత్రి ప్రగడ రవికుమార్.శెట్టి గోవిందరావు ,ఆరవెల్లి శ్రీనివాసచారి కల్లెపల్లి శ్రీనివాసరావు ,అల్లు సన్నిబాబు,శిరాపు శ్రీనివాసరావు, దొడ్డి రామ సతీష్, పెనుమత్స సురేష్, హనుమలశెట్టి శంకర రావు, ఆనంద్ పాల్గొన్నారు, ఈ సందర్బంగా బిజి అర్ పాత్రో, జైరాజు, పద్మ లకు యూనియన్ సభ్యత్వం అందజేశారు. (Story : సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం)