ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
డిఆర్డిఓ దత్తారావు
న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా :
ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డిఆర్డిఓ దత్తారావు అన్నారు. శుక్రవారం బెజ్జూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 2023,24 సంబంధించిన రూ. ఐదు కోట్లు పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో ఉపాధి హామీ పథకంలో 298 పనుల్లో 24 అంశాలపై 42 మంది సిబ్బందికి షోకాజు నోటీసులు వచ్చినట్లు తెలిపారు. 69 వేల నిధులను రికవరీ చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి సిబ్బందికి 12,000వేల జరిమానా విధించినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకంలో చెట్లు, ఉపాధి హామీ కొలతలు తేడాలు, వివిధ కారణాలతో సిబ్బందికి నోటీసులు అందజేసినట్లు తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా సహించే లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలతో చర్యలు తప్పవు తెలిపారు. ప్రతి కూలికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింద ని ప్రతి ఒక్కరు సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కృష్ణమూర్తి, ఎంపీడీవో గౌరీ శంకర్, ఎస్ఆర్పి తిరుపతి, డిఆర్పి అశోక్, ఏపీ వో రజనీకాంత్, గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. (Story : ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు )