సిఐ ని కలిసిన బి యస్ పి నాయకులు
న్యూస్‌తెలుగు/వినుకొండ :
వినుకొండ పట్టణ సీఐ యు. శోభన్ బాబు , జిల్లా కలెక్టర్ మరియు మంత్రి చేతుల మీదగా ఉత్తమ అధికారిగా ప్రశంస పత్రాన్ని అందుకున్నందుకు గాను వినుకొండ సిఐ యు శోభన్ బాబు ని వినుకొండ బి యస్ పి.,నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణ లో సమర్థవంతంగా పనిచేసినందుకు ఆగస్టు15 స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అసెంబ్లీ ఇంచార్జి మాసిపోగు ఏసోబు, పార్టీ నాయకులు గద్దల అవినాష్, పూనురి జాన్సన్, వల్లెపు రమేష్ బాబు, గుడిమెట్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : సిఐ ని కలిసిన బి యస్ పి నాయకులు)