యునిసెక్స్ సెలూన్లతో నాయి బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం
న్యూస్ తెలుగు/మణికొండ: మణికొండ ప్రాంతంలో యునిసెక్స్ సెలూన్ లు పెట్టి నాయి బ్రాహ్మణ వృత్తికి కళంకం చేస్తూ, ఈ కులస్తులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆరోపించింది. వృత్తి ధర్మాన్ని అనుసరించి గ్రామంలో పుట్టుక దగ్గర నుండి చావు వరకు జరుగు అన్ని కార్యక్రమాలను, ఆచారబద్దంగా సాంప్రదాయాలు నిర్వహించడం జరుపుతూ గౌరవప్రదంగా జీవిస్తున్న నాయి బ్రాహ్మణులకు తీరని అన్యాయాన్ని గావిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులకు, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో గ్రామ పెద్దలు సాయి రెడ్డి, మాజీ సర్పంచ్ వై.నరేష్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పురుషోత్తం, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగం కిరణ్ కుమార్, సీనియర్ నాయకుడు మహేష్, గ్రామ పెద్దలు బీ.రాములు, అశోక్, రాజ్‌నాథ్, మారుతి, జనార్ధన్, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఎస్.శ్రీనివాస్, బాబూరావు, అనిల్, ప్రవీణ్ కుమార్, శ్రీకాంత్, భరత్ కుమార్, సాయి ప్రసాద్, వెనుప్రసాద్, నవీన్, ప్రశాంత్, గోపాల్, మహేష్ తదితరులు ఉన్నారు. (Story: యునిసెక్స్ సెలూన్లతో నాయి బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం)