ఎట్టకేలకు ముస్లిమ్‌లకు శ్మశానవాటిక
ఎంఎల్ఏ విజ్ఙప్తితో స్థలం కేటాయించిన కలెక్టర్
న్యూస్ తెలుగు/మణికొండ: మణికొండ పరిసర ప్రాంతంలో ముస్లిం శ్మశాన వాటిక లేనందువలన ఇబ్బందులకు గురవుతున్నారు. మైనారిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సయ్యద్ జాఫర్ అహ్మద్ ప్రోద్బలంతో ది సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. స్థానిక పరిస్థితి వివరించగా వెంటనే ఎంఎల్ఎ స్పందించి కలెక్టర్ కు తెలుపగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జాయింట్ యాక్షన్ కమిటీ వారికి ది సిటిజన్స్ కౌన్సిల్ పూర్తి సహకారం అందించడం వలన ఎట్టకేలకు మణికొండ సర్వే నంబర్ 44 లో 5 ఎకరాల భూమిని ముస్లిం స్మశాన వాటికకు కేటాయించాలని స్థానిక తహసీల్దారుకు కలెక్టర్ ఆదేశించడమైనదని కౌన్సిల్ కార్యదర్శి షేక్ ఆరిప్ మొహమ్మద్ తెలిపారు. ఈ విషయమై తోడ్పడిన ఎంఎల్ఏ, కలెక్టర్, సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, సహచర మిత్రులు ఉపేంద్రణధ్ రెడ్డి, ఆశిం మొహమ్మద్, సయ్యద్ ఫజల్, సముద్దీన్ సాహెబ్, తక్డీర్ భాషా, ఖాజా మొహిద్దిన్, ముఖ్ట్యార్ సాహెబ్, ఇబ్రహీం సాహెబ్, అందె లక్ష్మణ్ రావు తదితరులందరికి స్థానికులు హృదయ పూర్వక శుభాభినందనలు తెలిపారు. (Story: ఎట్టకేలకు ముస్లిమ్‌లకు శ్మశానవాటిక)