UA-35385725-1 UA-35385725-1

లాభాపేక్ష హత్య కేసును నాలుగు రోజుల్లో చేధించిన పోలీసులు

లాభాపేక్ష హత్య కేసును నాలుగు రోజుల్లో చేధించిన పోలీసులు

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా బాడంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వృద్ధురాలిని హత్యచేసి, ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకు పోయిన కేసులో బొబ్బిలి మండలం పారాది గ్రామానికి చెందిన నిందితురాలు కలిశెట్టి లలిత కుమారి (25 సం.లు) అరెస్టు చేసి, ఆమె దోచుకున్న 14.5 తులాల బంగారు ఆభరణాలను నిందితురాలి వద్ద నుండి తిరిగి స్వాధీనం చేసుకొని, రిమాండుకు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియా సమావేశంలో వెల్లడించారు.
బాడంగి పోలీసు స్టేషన్ పరిధిలో బాడంగి గ్రామం ముగడ కాలనీలో నివాసం ఉంటున్న గెడ్డ కృష్ణవేణి (62 సం.లు) అనేవృద్ధురాలు ఇంటిలో చనిపోయినట్లు, ఆమె శరీరం పై ఉన్న బంగారు ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకొని పోయినట్లుగా పాలకొండ పట్టణంలో నివాసం ఉంటున్న వృద్ధురాలి చిన్న కుమారుడు గెద్ద నాగేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాడంగి పోలీసులు హత్య, దొంగతనం కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో చనిపోయిన వృద్ధురాలుగెడ్డ కృష్ణవేణి భర్త గెద్ద నారాయణప్పల నాయుడు హెడ్ మాష్టారుగా పనిచేసి 2018 సం॥లో చనిపోగా, అప్పటి నుండి ఆమెముగడ కాలనీలోనే ఒంటరిగా నివాసం ఉంటున్నారన్నారు. మృతి చెందిన కృష్ణవేణి పెద్ద కుమారుడు గెద్ద హరికృష్ణబాబు వృత్తిరీత్యా కుటుంబంతో విశాఖపట్టణంలోను, చిన్న కుమారుడు గెద్ద నాగేంద్ర కుమార్ కుటుంబంతో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నివాసం ఉంటున్నారన్నారు. ఇద్దరు కుమారులు అప్పుడప్పుడు తన తల్లి వద్దకు వచ్చి, ఆమె యోగ క్షేమాలు చూసుకొని, అవసరమైన మందులు కొనిచ్చి వెళ్ళిపోయేవారు. ఇదే క్రమంలో ఆగస్టు 11 న దిన ముగడ కాలనీలో ఉంటున్న తన తల్లి కృష్ణవేణి ఇంటి నుండి గ్యాస్ వాసన వస్తున్నట్లు, తలుపులు తెరిచి చూసేసరికి ఇంటిలో చనిపోయి ఉన్నట్లు, ఆమె వంటిపై ఉన్నటవంటి బంగారు ఆభరణాలు ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దోచుకుపోయారని అదే గ్రామంలో ఉంటున్న తెంటు లక్ష్మి పాలకొండలో ఉంటున్న కృష్ణవేణి చిన్న కుమారుడు గెద్ద నాగేంద్ర కుమార్ కు ఫోను చేసి, సమాచారం అందించగా, అతడు సంఘటనా స్థలానికి వచ్చి, తన తల్లి కృష్ణవేణి చనిపోయినట్లుగా నిర్ధారించుకొని, బాడంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా బాదంగి పోలీసులు హత్యా నేరం మరియు దొంగతనం కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు. దర్యాప్తులో భాగంగా చనిపోయిన కృష్ణవేణి ఇంటికి ఎదురుగా కొంతకాలంగా కలిశెట్టి లలిత కుమారి (25 సం.లు)అనే మహిళ నివాసం ఉంటూ, 20 రోజులు క్రితం ఇల్లు ఖాళీ చేసి విశాఖపట్టణం కంచరపాలెంకు వెళ్ళిపోయినట్లు, తరువాత తే.11-08-2024 దిన ముగడ కాలనీకి వచ్చి, ఒంటరిగా నివాసం ఉంటున్న కృష్ణవేణిని హత్య చేసి ఆమె శరీరంపై ఉన్నటువంటి 14.5 తులాల బంగారు ఆభరణాలు (విలువ రూ. 2,85,000/- లక్షలు) దోచుకొని వెళ్ళిపోయినట్లు సాంకేతిక పరిజ్ఞానంతో, సాక్ష్యాధారాలు సేకరించామని జిల్లా ఎస్పీ తెలిపారు. బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బొబ్బిలి సిఐ ఎం.నాగేశ్వరరావు, సిసిఎస్ సిఐ ఎ.సత్యన్నారాయణ మరియు సిబ్బంది సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి, నిందితురాలిని పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నిందితురాలు కలిశెట్టి లలిత కుమారి ని బొబ్బిలి ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద అరెస్టు చేసి, విచారణ చేయగా తనకు డబ్బులు అవసరమై గెద్ద కృష్ణవేణిని చున్నీతో గొంతు బిగించి, హత్య చేసి, ఆమె ఒంటిపైగల బంగారు ఆభరణాలు గాజులు, ఉంగరరాలు, గొలుసులు, పుస్తుల త్రాడు, కాసుల పేరు, చెవి దిద్దెలు, శతమానం, మంగళసూత్రంను తీసుకొని, వరారైనట్లుగా నేరంను అంగీకరించారని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితురాలి వద్ద నుండి బంగారు గొలుసు స్వాధీనం చేసుకొని, మిగిలిన వస్తువులను విశాఖపట్నం కంచరపాలెంలో తాను నివాసం ఉన్న ఇంటి నుండి స్వాధీన చేసుకున్నట్లుగా తెలిపారు .కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే హత్య కేసును చేధించి, దొంగిలించిన 14. 5 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డిఎస్పీ పి. శ్రీనివాసరావు, బొబ్బిలి సిఐ ఎం.నాగేశ్వరరావు, సిసిఎస్ సిఐ ఏ.సత్యనారాయణ మరియు బాడంగి ఎస్ఐ ఆర్. జయంతి, సిసిఎస్ ఎస్ఐ భాగ్యం, ఎఎస్ఐలు డి.కొండలరావు, ఎ.గౌరీ శంకర్, హెడ్ కానిస్టేబుళ్ళు డి.సన్యాసిరావు, ఎం.రామకృష్ణారావు, డి.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్ళు హిమ శంకర్, పి.విశాలమ్మలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.
ఈ మీడియా సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, బొబ్బిలి సీఐ ఎం.నాగేశ్వరరావు, సిసిఎన్ సిఐ ఎ.సత్యన్నారాయణ, ఎస్బి సిఐలు కె.కె.వి.విజయనాథ్, ఈ. నర్సింహమూర్తి, ఎస్ఐలు ఆర్. జయంతి, భాగ్యం, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (Story : లాభాపేక్ష హత్య కేసును నాలుగు రోజుల్లో చేధించిన పోలీసులు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1