సంపూర్ణ ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం
తెలంగాణ రాష్ట్ర నవనిర్మాణం కెసిఆర్ సాధ్యం
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి జాతీయపతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమములో ఐదు,ఆరు తరాలకు సంబంధించిన మహనీయులు ఎందరో త్యాగాలు,బలిదానాలు చేశారు.జీవితాలు అర్పించినారు పోరాటాలు చేశారు.వారి ఆశలు ఆశయాలు నెరవేరాలంటే చిత్తశుద్ధితో వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నం చేసి మహనీయులకు నివాళులు అర్పించాలని కోరారు. స్వాతంత్ర సంపూర్ణ ఫలాలు అట్టడుగు ప్రజలకు చేరే ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని దేశ జ్ఞనాసంపద,సహజవనరుల సంపద,సామాజిక సంపద విస్తృతంగా వినియోగంలోకి రావడమే నిజమైన స్వాతంత్య్రం అని ఆయన అన్నారు.
దేశప్రజల సంపద పెరాగాల్సి ఉండగా కొద్దిమందికి సంపద పెరిగెవిధంగా భారత ప్రజాస్వామ్యం ముందుకు పోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో మౌలిక వసతులు మంచినీరు విద్యా వైద్యం పరిశ్రమలు సంపూర్ణంగా పూర్తి చేయడానికి రాజకీయ వ్యవస్థ కృషి చేయాలి ద్దురదృష్టం ఏమిటంటే ఎవరు అధికారంలో ఉంటే వారి ప్రయోజనాలకోసం పనిచేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుంది.
కె.సి.ఆర్ గారివల్లనే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యం అవుతుందని ఈ ప్రక్రియ కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదని స్పష్టం చేశారు.కె.సి.ఆర్ గారి ఆశయాలు సాధించడానికి బి.ఆర్.ఎస్ శ్రేణులు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
గత 9ఏండ్ల కెసిఆర్ పాలనలో మనకు అయిదింతలు,మూడింతలు,రెండింతలు పెద్ద రాష్ట్రలైన ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల కంటే అభివృద్ధిలో కె.సి.ఆర్ మన రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిపారని అన్నారు.
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరోసారి కె.సి.ఆర్ అధికారంలోకి రావాలని అందుకు మనమందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పి.రమేష్ గౌడ్, నందిమల్ల.అశోక్ మాజీ Z.P.T.Cలు రఘుపతి రెడ్డి,సామ్యా నాయక్,పద్మ వెంకటేష్,మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం,రాళ్ళ.కృష్ణయ్య, సర్దార్ ఖాన్,గంధం.పరంజ్యోతి, కౌన్సిలర్స్ బండారు.కృష్ణ,నాగన్న యాదవ్,కంచె.రవి, నాయకులుఉంగ్లమ్. తిరుమాల్, ప్రేమ్ నాథ్ రెడ్డి, స్టార్.రహీమ్,ధర్మా నాయక్ నందిమల్ల.రమేష్, ఎం.డి. గౌస్, సయ్యద్.జామీల్,గులాం ఖాదర్ ఖాన్, నీల స్వామి,చిట్యాల.రాముసూర్యవంశపు.గిరి, జోహేబ్ హుస్సేన్,హేమంత్ ముదిరాజ్,మహిళా నాయకులు మధులత,సాయిలీల,కవిత,గంధం.విజయ్, సీరిగిరి.మన్నెం,వజ్రాల.రమేష్ పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : సంపూర్ణ ఫలాలు అట్టడుగు స్థాయి ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం)