ఎంతోమంది ప్రాణత్యాగాలు, పోరాట వీరుల బలిదానంతోనే స్వాతంత్ర ఫలాలు
కలెక్టర్ జె.వెంకట మురళి
కలేకరేట్ లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్‌తెలుగు/బాపట్ల : ఎంతోమంది ప్రాణత్యాగాలు, పోరాట వీరుల బలిదానంతోనే స్వాతంత్ర ఫలాలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. 78వ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ పై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగురవేశారు. త్రివర్ణ పతాకానికి ఆయన సెల్యూట్ చేసిన తదుపరి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
మహనీయుల త్యాగాల స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. భావితరాలకు మంచి సమాజం నిర్మిద్దామని పిలుపునిచ్చారు. బానిసత్వం నుంచి భారతదేశానికి స్వేచ్ఛ కావాలని ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటాలు చేశారని వివరించారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ శ్వేచ్ఛా వాయువులు ఇందులో రావాలని జాతీయ భావంతో చేసిన పోరాటాలు మన కళ్ళముందే ఉన్నాయని చెప్పారు. 183 దేశాలలో కొన్ని దేశాలు నేటికీ బానిసత్వంలోనే ఉన్నాయని తెలిపారు. నేటి యువతరానికి బానిసత్వం, స్వేచ్ఛపై అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. స్వాతంత్రం స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ బి సుబ్బారావు, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : ఎంతోమంది ప్రాణత్యాగాలు, పోరాట వీరుల బలిదానంతోనే స్వాతంత్ర ఫలాలు)