Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ ప్రతిష్ట పెంచే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించాలి

పోలీసుశాఖ ప్రతిష్ట పెంచే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించాలి

0

పోలీసుశాఖ ప్రతిష్ట పెంచే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించాలి

విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టీ, ఐపిఎస్

న్యూస్‌తెలుగు/విజయనగరం : విశాఖపట్నం రేంజ్ డిఐజి గా బాధ్యతలు చేపట్టిన తరువాత గోపీనాథ్ జట్టీ జిల్లాకు విచ్చేశారు ఎస్పీ వకుల్ జిందల్, 5వ బెటాలియన్ కమాండెంట్ మల్లికా గార్గ్, ఇతర పోలీసు అధికారులు డిఐజి గోపీనాథ్ జట్టీకి పుష్ప గుచ్చాలను అందజేసి, సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం, డిఐజీ గోపీనాథ్ జట్టీ జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో సమావేశమై, పోలీసుశాఖ ప్రతిష్టను పెంచేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించాల్సిన తీరు, నిర్వహించాల్సిన విధులు పట్ల దిశా నిర్దేశం చేసారు.ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి గోపీనాధ్ జట్టీ మాట్లాడుతూ – హెూంగార్డు నుండి ఐపిఎస్ అధికారుల వరకు ఎంతో శ్రమించి, పోలీసుశాఖ ప్రతిష్టను ఇనుమటింపజేసి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరును తీసుకొని వచ్చారని, ఆ ప్రతిష్టను మరింతగా పెంచేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది సత్పవ్రర్తనతో మెలగాలన్నారు. పోలీసు స్టేషనుకు న్యాయం కోసం వచ్చే నిరుపేదలు, మహిళలు, వృద్ధులు పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని, వారికి అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను శ్రద్ధతో విని, న్యాయం చేసేందుకు చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహర తీరులో మార్పులు చేసుకోవాలని, ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి పట్ల సానుకూల దృక్పదంతో వ్యవహరించాలన్నారు. పోలీసు వ్యవస్థలో మార్పులు వచ్చినప్పటికీ నేరాల నియంత్రణలో గతంలో అవలంభించిన బేసిక్ పోలీసింగును మరిచిపోవద్దని, గ్రామ సందర్శనలు, పెట్రోలింగు, రాత్రిబీట్లు, పగలు బీట్లు చేయాలని, గ్రామాల్లో చెడు నడత కలిగిన వ్యక్తులు, గ్రామాల్లోని ప్రధానమైన శాంతిభద్రతల సమస్యలు గురించి విచారణ చేయాలన్నారు. బేసిక్ పోలీసింగు చేయడం వలన ప్రజలకు మేలు జరుగుతుందని, నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. గతంలో నమోదైన నేరాల కంటే ప్రస్తుతం కొత్త తరహాలో నేరాలు నమోదవుతున్నాయని, వీటిని సవాళ్ళుగా తీసుకొని, పోలీసుల పని తీరు మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొత్త తరహాలో నమోదవుతున్న డ్రగ్స్, సైబరు నేరాలను దర్యాప్తు చేసేందుకు అవసరమైన మెళుకవులను పోలీసు అధికారులు అందిపుచ్చుకోవాలన్నారు. అందుకు కాలానుగుణంగా వస్తున్న మార్పులను గమనిస్తూ, ఎప్పటికప్పుడు పని తీరును మెరుగుపర్చుకోవాలన్నారు. అందుకు సుప్రీం, హైకోర్టు వెలువరించిన తీర్పులను పరిశీలన చేసుకోవాలని, న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటూ, ఐ.టి. చట్టం, స్పెషల్ అండ్ లోకల్ చట్టాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజల్లో చైతన్యం నింపేందుకు సోషల్ మీడియాను వినియోగించుకోవాలని అధికారులకు డిఐజి సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి, వ్యక్తుల మనోభావాలను కించపరుస్తూ, వ్యక్తిత్వ హననంకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను డిఐజి ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజలకు మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించే అధికారులను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తామని, తప్పు చేసే అధికారులు, సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని అన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – జిల్లాలో నమోదవుతున్న నేరాల తీరును, శాంతిభద్రతల అంశాలను, వాటి పరిరక్షణకు జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న చర్యలను డిఐజికి వివరించారు. అదే విధంగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, అమ్మకాలు, వినియోగించే వారిపై జిల్లా పోలీసులు చేపడుతున్న చర్యలను తెలిపారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు ఇతరు రాష్ట్రాల నుండి జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఏడు మార్గాలను గుర్తించి, ఆయా మార్గాల్లో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు, ఆకస్మికంగా, వేరువేరు చోట్ల, వేరువేరు సమయాల్లో డైనమిక్ వాహన తనిఖీలను చేపడుతున్నట్లుగా వివరించారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, న్యాయ సలహాదారులు వై. పరశురాం, పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story : పోలీసుశాఖ ప్రతిష్ట పెంచే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version