Home వార్తలు సామ్‌సంగ్‌ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ షార్ట్‌లిస్ట్‌ ఖరారు

సామ్‌సంగ్‌ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ షార్ట్‌లిస్ట్‌ ఖరారు

0

సామ్‌సంగ్‌ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ షార్ట్‌లిస్ట్‌ ఖరారు

న్యూస్‌తెలుగు/గురుగ్రామ్‌: సామ్‌సంగ్‌ ఇండియా తన ఫ్లాగ్‌షిప్‌ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ప్రోగ్రామ్‌ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ 2024 కోసం టాప్‌ 20 టీమ్‌ల జాతీయ షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించింది. తదుపరి జాతీయ రౌండ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఈ జట్లు గొప్ప భౌగోళిక వైవిధ్యాన్ని సూచిస్తాయి. భారతదేశం అంతటా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వీరిలో ఉన్నారు. వీరిలో కొందరు మణిపూర్‌లోని ఇంఫాల్‌, మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌, ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ వంటి కొన్ని మారుమూల ప్రాంతాలకు చెందిన వారు. ఈ కార్యక్రమం 3వ ఎడిషన్‌లో, విద్యార్థులు తమ ఆలోచనలను ‘కమ్యూనిటీ`ఇన్‌క్లూజన్‌’, పర్యావరణం, సుస్థిరత’ అనే రెండు అంశాల క్రింద సమర్పించారు. స్కూల్‌ ట్రాక్‌లోని దాదాపు 20% ఆలోచనలు విద్య, వెనుకబడిన సమూహాలకు వనరులకు యాక్సెస్‌, అనుభవపూర్వక అభ్యాసం, డిజిటల్‌ అక్షరాస్యత చుట్టూ ఉన్న సవాళ్లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారించాయి. (Story : సామ్‌సంగ్‌ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ షార్ట్‌లిస్ట్‌ ఖరారు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version