Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోలవరం పునరావాస ప్యాకేజీ తాజా అంచనాలతో ఒకేసారి చెల్లించాలి

పోలవరం పునరావాస ప్యాకేజీ తాజా అంచనాలతో ఒకేసారి చెల్లించాలి

0

పోలవరం పునరావాస ప్యాకేజీ తాజా అంచనాలతో ఒకేసారి చెల్లించాలి

పివిటిజీల ఆవాసాలపై దృష్టి పెట్టాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

న్యూస్ తెలుగు/ చింతూరు : సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం మండలంలోని ఎర్రంపేట గ్రామంలో శుక్రవారం మర్లపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. తొలుత సిపిఎం పార్టీ జెండాను నాయకులు మేకల నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడినారు. పివిటిజిల ఆవాసాల పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పోలవరం నిర్వాసితులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి యువకులకు నివాసాలు ఖాళీ చేయించే నాటికి కటాఫ్ డేట్ లేకుండా ఆర్ అండ్ ఆర్ మరియు ప్యాకేజీ అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పివిటిజి ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని రహదారులు మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు ఏజెన్సీకి కేటాయించకుండా అభివృద్ధి నిరోధకలుగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. గిరిజన గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు వీధిలైట్లు త్రాగునీరు వంటి సదుపాయాలు ఇంకా వాటి లేమి కనిపిస్తుందని. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు ఎందుకు కేటాయించటలేదు సమాధానం చెప్పాలన్నారు. ప్రతి సంవత్సరం గిరిజన అభివృద్ధికి కేటాయించే నిధులు ప్రభుత్వం ఆయా సమస్యగా ప్రాంతాల్లో వినియోగించి సమస్యలు పరిష్కరించాల్సి ఉందని అలా చేయకుండా సమస్యలను గాలీ కి వదిలేశారని అన్నారు. పోలవరం నిర్వాసితులకు సరైన పునరావాసం కల్పించే దాంట్లో సర్వే చేసే దాంట్లో తీవ్ర జాప్యం కనిపిస్తుందని జులై ఆగస్టు నెలలో వస్తున్నాయంటేనే ముంపు మండలాల్లో ప్రజలు వణికిపోతున్నారని వరదల ధాటికి నిర్వాసితులు కాక వికలామైపోయి చెట్టుకు ఒకరు పుట్టకొకరుగా చీలిపోతున్నారని అన్నారు. ప్రభుత్వం ఒక్కటే ముంపు మండలాల కాంటూరు మునిగే ప్రాంతమంతా ఒకే కాంటూరులోకి పరిగణలో తీసుకొని పరిహార పునరావాసం కల్పించే దాంట్లో వేగవంతం చేయాలని పునరావాస కాలనీలో ఇప్పటికే నిర్మించిన కాలనీలో త్రాగునీరు రోడ్లు డ్రైను వంటి సమస్యలు నెలకొన్నాయని అటువంటివి తక్షణమే పరిష్కారం చేయాలని పునరావాస కాలనీలో ప్రజలకు కావలసిన అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతనే వారిని తరలించాలన్నారు. స్ట్రక్చర్ వేల్యూ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతుందని నాలుగు మండలాల్లో ఇష్టం ను సారంగా ఇంటి విలువను అంచనా వేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని న్యాయపరంగా ఖచ్చితమైన ఇంటి విలువలను తీసుకోవడంలో అధికారులు విఫలమైనారని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలవరం అధికారులు ఈ ప్రాంతాన్ని త్యాగం చేసి పునరావాసాలకు తరలి వెళ్తున్న ముంపు ప్రజానీకంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారికి న్యాయమైన పునరావాసం పరిహారం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి లోకనాథం, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వాణిశ్రీ, మర్లపాటి నాగేశ్వరరావు, విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు సోయం చినబాబు, సిఐటియు ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్, సీనియర్ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి సేసం సురేష్, సర్పంచ్ కారం బుచ్చమ్మ మండల కార్యవర్గ సభ్యులు సత్తిబాబు ప్రతి పిఎన్ఎమ్ కళాకారులు ఐవి, సుబ్బారావు పాల్గొన్నారు. (Story:పోలవరం పునరావాస ప్యాకేజీ తాజా అంచనాలతో ఒకేసారి చెల్లించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version