Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్వాతంత్య్ర‌ సమరయోధుల పోరాటాలు, త్యాగాలు నేటితరానికి తెలియాలి

స్వాతంత్య్ర‌ సమరయోధుల పోరాటాలు, త్యాగాలు నేటితరానికి తెలియాలి

స్వాతంత్య్ర‌ సమరయోధుల పోరాటాలు, త్యాగాలు నేటితరానికి తెలియాలి

వినుకొండలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభం

రాష్ట్ర ప్రజలకీ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీవీ

న్యూస్‌తెలుగు/వినుకొండ: స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలు, త్యాగాలు నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. హర్‌ఘర్ తిరంగా వంటి కార్యక్రమాల ద్వారా ఆ లక్ష్యం నెరవేరడంతో పాటు మన మువ్వొన్నెల జాతీయ పతాకం విశిష్టతను వివరించేందుకు అవకాశం లభిస్తుందన్నారు.
ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినుకొండలో బుధవారం హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించిన జీవీ జాతీయజెండా చేతబూని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ నినదిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. 500 అడుగుల జాతీయ జెండాతో భారీర్యాలీని ముందుండి నడిపించారు. వందలాది జాతీయ జెండాల రెపరెపలతో ఈ ప్రదర్శన ఎంతో రమణీయంగా సాగింది. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకునేలా విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో ఆకట్టుకున్నారు. వినుకొండ పట్టణంలోని విష్ణుకుండినగర్ ఎన్నెస్పీ కాల్వ వద్ద నుంచి బస్టాండ్, శివయ్య స్తూపం సెంటర్ మీదుగా జాషువా కళామందిరం వరకు ర్యాలీ సాగింది. అనంతరం జాషువా కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. దేశ విభజన అనంతరం ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ దేశ విభజన భయానక రోజు పేరిట ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోకుంటే నేటి ఉత్సవాలు అసంపూర్తిగానే అనిపిస్తాయన్నారు. జాతీయతాభావాన్ని పెంపొందించేలా, స్వాతంత్ర్య పోరాట స్మృతులను గుర్తు తెచ్చేలా హర్‌ఘర్ తిరంగ వంటి కార్యక్రమాన్ని రూపొందించిన ప్రధానమంత్రి మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దేశభక్తి భావనను పెంపొందించేందుకు ఇలాంటి ర్యాలీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. వినుకొండ ప్రజలంతా దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, పట్టణ అభివృద్ధిలో పునరంకితం కావాలన్నారు. ఇదే సందర్భంగా పేదల ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారని, ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జీ.వీ ఆంజనేయులు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం సమన్వయకర్త కొనిజేటి నాగ శ్రీను రాయల్, జిల్లా బిజెపి నాయకులు మేడమ్ రమేష్, అలాగే జిల్లా జనసేన నాయకులు నిస్సంకర్ శ్రీనివాసరావు, ఎంఈఓ గారు జెఫ్రూలాఖాన్,ప్రైవేట్ స్కూల్స్ డైరెక్టర్లు ఇంకా టిడిపి నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, సౌదాగర్ జానీ భాష,తెలుగు విద్యార్థి నాయకులు నర్రా కిషోర్, ప్రశాంత్,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!