కీర్తిలాల్స్ ‘ది టైమ్ లెస్ ఎడిట్’ ఆభరణాల ప్రదర్శన
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ అయిన కీర్తిలాల్స్, తన తాజా వజ్రాభరణాల సేకరణ అయిన ‘‘ది టైమ్ లెస్ ఎడిట్’’, అత్యాదునిక సృజనాత్మక సాంకేతిక ఆభరణాలని తన సోమాజిగూడ సర్కిల్ షోరూంలో ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా కీర్తిలాల్స్ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ డైరెక్టర్- బిజినెస్ స్ట్రాజటీ, అన్నారు. ఈ ‘‘ది టైమ్ లెస్ ఎడిట్’’ సేకరణ, ఆధునిక శైలి ప్రామాణికమైన సాంప్రదాయిక శ్రేష్టతలని ఎంతో చక్కగా మేళవించి, ప్రత్యేకమైన రూపకల్పనలతో సంక్లిష్టమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ విశిష్టమైన సేకరణ, సాంప్రదాయిక శోభని, సమకాలీనతో కలిపి సౌందర్యాన్ని పునరావిష్కరిస్తోందన్నారు. కీర్తిలాల్స్ సృజనాత్మక సాంకేతిక ఆభరణాలు, లగ్జరీ నగల్ని అదునాతన సాంకేతికతలతో, ఇంటరాక్టివ్ అంశాలు, అనుగుణ్యంగా మార్చుకునే అంశాలతో విప్లవీకరిస్తున్నాయి.హైదరాబాద్ లోని కీర్తిలాల్స్ షోరూంలో ఆగస్ట్ 22, 2024 వరకూ సందర్శించవచ్చునన్నారు. (Story : కీర్తిలాల్స్ ‘ది టైమ్ లెస్ ఎడిట్’ ఆభరణాల ప్రదర్శన)