రెవిన్యూ సదస్సులను విజయవంతం చేయాలి
• 90 రోజుల తర్వత గ్రామాల్లో ఎలాంటి
రెవిన్యూ సమస్యలు ఉండకూడదు
• ప్రజా ప్రతినిధులు గ్రామ సభల్లో హాజరు కావాలి
• జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : గ్రామ స్థాయి లో భూములకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం రెవిన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30 వరకు 45 రోజుల పాటు ప్రతి రెవిన్యూ గ్రామం లో ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, అందుకోసం గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేయడం జరుగుతుందని, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని రెవిన్యూ సదస్సులను జయప్రదం చేయాలనీ కలెక్టర్ తెలిపారు. ఈ నెల 15 న జిల్లాలో జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస రావు లాంచనంగా ప్రారంభిస్తారని తెలిపారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ లో శాసన సభ్యులు, రెవిన్యూ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వక్ఫ్, దేవాదాయ, అటవీ, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవిన్యూ సదస్సుల నిర్వహణ పై ముందుగా ప్రజల్లో అవగాహన కలిగించాలని, రెవిన్యూ కు సంబంధించి 5 రకాల సమస్యల పై వినతులను స్వీకరించడం జరుగుతుందని, ప్రతి వినతికి రసీదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 5 రకాల సమస్యలకు 5 వేర్వేరు రిజిస్టర్లను నిర్వహించాలని, వచ్చే ప్రతి దరఖాస్తును మండల బృందాలు క్షున్నంగా పరిశీలించాలని తెలిపారు. గ్రామ సభ కు రెండు రోజుల ముందే గ్రామం లోని భూముల వివరాలతో కూడిన మ్యాప్ లను గ్రామ సచివాలయం, ఇతర గ్రామ స్థాయి కార్యాలయాల వద్ద డిస్ప్లే చేయాలనీ సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో రెవిన్యూ సదస్సుల పై కరపత్రాలను కూడా పంపిణీ చేయాలనీ సూచించారు. 45 రోజుల పాటు తీసుకున్న వినతులన్నిటినీ పరిష్కరించడానికి మరో 45 రోజుల గడువు ఉంటుందని , 90 రోజుల తర్వాత గ్రామాల్లో ఇక ఎలాంటి రెవిన్యూ సమస్యలు ఉండకూడదని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎం ఎల్ ఏ లు, ఎం ఎల్ సి లు, తదితర ప్రజా ప్రతినిధులు కనీసం ఒక్క రోజైనా పాల్గొనాలని, అలాగే భూ సమస్యల పై పని చేస్తున్న స్వచ్చంద సంస్థల సభ్యలు కూడా పాల్గొనాలని తెలిపారు.
ఈ సమావేశం లో ఎస్.కోట శాసన సభ్యులు కోళ్ళ లలిత కుమారి, రాజాం శాసన సభ్యులు కోండ్రు మురళీ , డి.ఆర్.ఓ అనిత, ఆర్.డి.ఓ లు సూర్య కళ , సాయి శ్రీ, శాంతి , అదనపు ఎస్.పి అసమా ఫరీన్ , జిల్లా రిజిస్ట్రార్ కుమారి, సర్వే ఏ.డి. త్రివిక్రమ రావు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్, వక్ఫ్ బోర్డు ప్రతినిధులు, స్వచ్చన సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. (Story : రెవిన్యూ సదస్సులను విజయవంతం చేయాలి )