UA-35385725-1 UA-35385725-1

“తంగలాన్” అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ 

“తంగలాన్” అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ 

హీరో చియాన్ విక్రమ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. “తంగలాన్” సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్”  సినిమా  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ రోజు విజయవాడలో “తంగలాన్” చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

హీరో విక్రమ్‌ మాట్లాడుతూ – మా “తంగలాన్” మూవీ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం హ్యాపీగా ఉంది. బాబాయ్ హోటల్ లో ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. వీవీఐటీ కాలేజ్ విజిట్ చేశాం. అక్కడ స్టూడెంట్స్ ఎనర్జీ సర్ ప్రైజ్ చేసింది. తెలుగు ఆడియెన్స్ మంచి సినిమాకు ఎంతగా సపోర్ట్ చేస్తారో నాకు తెలుసు. నా ‘అపరిచితుడు’ సినిమా దేశంలోనే విజయవాడలో అత్యధిక రోజులు ఆడింది. మీ అందరికీ  థ్యాంక్స్ చెబుతున్నా. ఇదొక బ్యూటిఫుల్‌ అడ్వెంచరస్‌ మూవీ. డైరెక్టర్‌ రంజిత్‌ ఈ సినిమాను అందంగా రూపొందించాడు. తంగలాన్‌ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూసి మీ రెస్పాన్స్ ఇస్తారా అని వెయిట్‌ చేస్తున్నాను. నా ఫేవరేట్ డైరెక్టర్ పా రంజిత్ గారితో ఈ మూవీ చేశాను. ప్రేక్షకులందరికీ నచ్చేలా అన్ని ఎమోషన్స్ తో రంజిత్ గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక కొత్త వరల్డ్ లోకి మిమ్మల్ని “తంగలాన్” సినిమా తీసుకెళ్తుంది. ఆగస్టు 15న తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ మాట్లాడుతూ – ‘తంగలాన్‌’  మూవీలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ నాది. ఈ చిత్రంలో విక్రమ్‌ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. పా రంజిత్‌ అమేజింగ్ డైరెక్టర్. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు థ్యాంక్స్‌. థియేటర్స్ లో తప్పుకుండా చూడండి. అన్నారు.

హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ మాట్లాడుతూ –  ‘తంగలాన్‌’ ప్రమోషన్ కోసం విజయవాడ రావడం సంతోషంగా ఉంది. బ్యూటిఫుల్ ఫ్లేస్ ఇది. ఇక్కడ బాబాయ్ హోటల్ లో ఫుడ్ టేస్ట్ చేశాం. చాలా బాగుంది. మీ అందరు మా మూవీ టీమ్ పై చూపిస్తున్న లవ్ కు థ్యాంక్స్. ‘తంగలాన్‌’ లో ‘ఆరతి’ అనే క్యారెక్టర్‌ చేశాను. నా కెరీర్ లో చేసిన ది బెస్ట్ రోల్ ఇది. ఈ పాత్రలో నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

నిర్మాత ధనుంజయన్‌ మాట్లాడుతూ  ‘తంగలాన్‌’ సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన టీజర్‌, ట్రైలర్‌ కొంత మాత్రమే. సినిమాలో చాలా మెస్మరైజింగ్‌ కంటెంట్‌ ఉంది. ఛియాన్‌ విక్రమ్‌ అద్భుతమైన పర్‌ ఫార్మెన్స్‌ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆయన ఈ క్యారెక్టర్‌ లో ఎలా నటించారని మీరు ఆశ్చర్యపోతారు. అంత డెడికేషన్‌తో విక్రమ్‌ నటించారు.’తంగలాన్‌’ సినిమాను మా టీమ్‌ తో పాటు ప్రేక్షకులకు మెమొరబుల్‌ మూవీ అవుతుంది. తప్పకుండా థియేటర్‌లో చూసి ఎంజారు చేస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

నటీనటులు – చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్, పార్వతీ తిరువోతు, పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు (Story : “తంగలాన్” అన్ని ఎమోషన్స్ ఉన్న ఒక గుడ్ మూవీ )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1