ఏపీ స్వచ్ఛంద క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి
యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రంగరాజు
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఏపీ స్వచ్ఛంద్ర క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యల పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఏపీ స్వచ్ఛంద క్లాప్ వెహికల్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రంగరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ రంగరాజు, ప్రధాన కార్యదర్శి బంగారు శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వచ్ఛ్ ఆంధ్ర సంకల్ప్ అనే పథకంలో భాగంగా పట్టణాల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం గాను క్లాప్ వెహికల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గాని ప్రభుత్వం తరఫున వేతనాల చెల్లించే విధానం కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వేతనాలు ఇవ్వడం వల్ల అనేక ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు. ప్రభుత్వం జీవో ప్రకారం క్లాప్ డ్రైవర్లకు 18,500 వేతనాలు ఇవ్వాలన్నారు. డ్రైవర్ లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ, అమలు చేసి ఉద్యోగ భద్రత,జాబ్ కార్డు ఇవ్వాలన్నారు. క్లాప్ డ్రైవర్లకు మోటార్ యాక్ట్ చట్టం వర్తింపజేసేలా చూడాలన్నారు. డ్రైవర్లకు కాంట్రాక్టు విధానం రద్దు చేయాలన్నారు. 8 నెలల పిఎఫ్ వేసేలా ప్రయత్నం చేయాలన్నారు. డ్రైవర్లకు వారాంతపు సెలవు ఇప్పించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ పొడుగు రామకృష్ణ, కే రవి, వై లక్ష్మణరావు,ఆర్ బంగారయ్య, కే సూరిబాబు, కే సంతోష్, ఎన్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు