Homeవార్తలునగరపాలక కార్యాలయంలో ప్రజా వినుతుల పరిష్కార వేదిక

నగరపాలక కార్యాలయంలో ప్రజా వినుతుల పరిష్కార వేదిక

నగరపాలక కార్యాలయంలో ప్రజా వినుతుల పరిష్కార వేదిక

న్యూస్‌తెలుగు/విజయనగరం : సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక నకు 4 వినతులు వచ్చాయి. పలువురు తమ సమస్యలను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు నకు అందజేశారు. ఆయా వినతుల పరిష్కారానికై సంబంధిత విభాగ అధికారులకు కమిషనర్ ఆదేశించారు. శానిటేషన్ కు సంబంధించి 1, హౌసింగ్ కు సంబంధించి 2, ఇతర సమస్య పై 1 చొప్పున వినతులు అందాయి. సిబ్బంది వినతులను స్వీకరించిన కమిషనర్ ఎంఎం నాయుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రజల నుండి వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామన్నారు. నగరంలో దోమల నియంత్రణకై ప్రతిరోజు ఫాగింగ్ యంత్రాలతో నివారణా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ఏంటి లార్వా ఆపరేషన్ నిరంతరాయంగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి,ఏసీపీ అమ్మాజీ రావు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. (Story :నగరపాలక కార్యాలయంలో ప్రజా వినుతుల పరిష్కార వేదిక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments