Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఇంటింటికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ 

ఇంటింటికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ 

0

ఇంటింటికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ 

న్యూస్‌తెలుగు/వనపర్తి  : గతంలో అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రజా ప్రతినిధుల ఇల్ల చుట్టూ కాల్లు అరిగేలా తిరిగిన కనుకరించకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడే వ్యవస్థ నుంచి నేడు పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ ఫలాలను అందజేస్తున్నారు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు
శనివారం వనపర్తి పట్టణంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల లబ్ధిదారులకు ఎమ్మెల్యేని స్వయంగా ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందజేశారు
ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వా పాలనలు ప్రభుత్వ పథకాలను అందుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందేనని నేడు ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు ఒక్కరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని ఈ క్రమంలోనే మీకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు
కళ్యాణ లక్ష్మి చెక్కులు గాని, ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు గాని, దళారులను నమ్మి మోసపోకూడదని వీటి మంజూరి కోసం ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వారికి సూచించారు
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ గతంలో ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా చూసామని నేడు మాకు ఇంటి వద్దకే ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను తీసుకువచ్చి అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని తమలాంటి ఎమ్మెల్యేను ఎప్పటికీ కూడా మర్చిపోమని వారు ఆనందం వ్యక్తం చేశారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాతనాటి కృష్ణయ్య, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ( Story : ఇంటింటికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version