Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రెండవ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన టి శ్రీనివాసరావు

రెండవ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన టి శ్రీనివాసరావు

0

రెండవ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన

టి శ్రీనివాసరావు

న్యూస్‌తెలుగు/విజయనగరం : ఇటీవలజరిగిన బదిలీల్లో భాగంగా 2వ పట్టణ పోలీసు స్టేషను ఇన్స్పెక్టర్ గా టి. శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ను మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ విజయనగరం 2వ పట్టణ పీఎస్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, గంజాయి అక్రమ రవాణా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహించాల్సిన విధులు, బాధ్యతల పట్ల సిఐ దిశా నిర్దేశం చేసారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండో పట్టణ సిఐగా రావడం ఆనందంగా ఉందన్నారు. తన పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలలో సూక్ష్మస్థాయి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. దొంగతనాలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తామన్నారు. రానున్న కాలంలో అన్ని కళాశాలలో పాఠశాలలకు వెళ్లి యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. (Story : రెండవ పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన టి శ్రీనివాసరావు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version