UA-35385725-1 UA-35385725-1

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ప్రపంచ దేశాలకు ఆదిమవానుల సంప్రదాయాలే ఆదర్శం

పట్టణంలో భారీ ర్యాలీ

ఆదివాసీ నాయకులకు ఘన నివాళి

ఆకట్టుకున్న గిరిబిడ్డల ఆటా పాట

న్యూస్ తెలుగు /భద్రాద్రి కొత్తగూడెం : ఇతిహాన, నాగరికత, సంస్కృతి సంప్రదాయాలను పాటించడంలో ఆదివాసీ గిరిజనులు ఆదర్శంగా ఉంటారని, పాశ్చ్యాత్య నాగరికత అనసరిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆదివాసీ తెగలు అనాదిగా వస్తున్న ఆచార వ్యవహాలు అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎంఎల్ డా. తెల్లం వెంకట్రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి బ్రిడ్డీ వరకు అక్కడ్నుంచి ఐటిడిఏ వరకు సాంప్రదాయబద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని గిరిజన పోరాటయోధుల విగ్రహాలకు ఐటిడిఏ పిఓ రాహుల తో కలిసి ఎంఎల్ఎ పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ముందుగా ఆదివాసీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఐటిడిఏ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐఖ్యరాజ్య సమితి ప్రతినిధుల తీర్మాణం మూలంగా నేడు మనమంతా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషల్లో 90 శాతం భాషలు ఆదివాసీలవే అని, భాషలేని ఆదివాసీలు కేవలం 5 శాతం మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆదివాసీలు అతితక్కువమంది మాత్రమే భాషలో మాట్లాడుతారని, దీని వల్ల భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలు అంతరించే పోయే ప్రమాదం ఉండన్నారు. ఆదివాసీ కుటుంబాల వారు వారి పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలను నేర్పించాలన్నారు. ఆదివాసీ గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చని ఎంఎల్ చెప్పారు. ఆదివాసీల పెళ్లిల్లు ఎంతో ఘనంగా నిర్వహింస్తారని, తొలకరిరోజుల్లో వ్యవసాయం మొదలుపెట్టే ముందు, పంటలు చేసికొచ్చిన తర్వాత అంతా ఒకదగ్గరుకు చేరిని వేడుక చేసుకుంటారని, ఇది ఐఖ్యమత్యానికి చిహ్నం అన్నారు. గిరిజన సంక్షేమంతో పాటు కొండరెడ్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాటాల్డుతూ గిరిజనులకు సేవేచేసే భాగ్యం కలగడం అదృష్టం అన్నారు. భూమి, అడవిని కాపాడుకోవడం చట్టప్రకారం మన హక్కని, భూముల్లో తక్కువపెట్టుబడితో ఆర్గానిక్ పంటలు వేసి అధిక లాభాలు పొందాలన్నారు. గిరిజన రైతులు, గిరిజన నిరుద్యోగులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రధానంగా గిరిజన రైతులు చేపల చెరువులు, పండ్ల తోటలు వేసుకుని జీవనోపాధి పొందాలన్నారు. గిరిజన విద్యార్థులు నిజాయితీగా ఉండి పట్టుదలతో చదువుకుని పైకి రావాలన్నారు.

అనంతరం ఐటిడిఏ పీఓ బి రాహుల్ మాట్లాడుతూ గిరిజన విద్యార్ధినీ విద్యార్థుల పట్ల ఐటిడిఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. వారికి మౌళికసదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు వృత్తి శిక్షణ, గ్రూప్ పరీక్షలు రాసే వారికి కోచింగ్ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. స్పోర్స్ పాఠశాలకు అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థులు దేశ విదేశాల్లో రానించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టామన్నారు. భద్రాచలం కేంద్రంగా త్వరలో విప్పపూల నూనె తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గిరిజన గ్రామాల్లో పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉండకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

అనంతరం ఎస్పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలు కల్మషం లేని స్వచ్చమైన మనసున్న వారని యుక్తవయస్సులో ఉన్న పిల్లలు తొందరపాటు చర్యలకు పాల్పడి ప్రమాదాల భారినపడవద్దన్నారు. గిరిజన యువకులు అటవీ గ్రామాలను వదిలి బాహ్య ప్రపంచం వైపు అడుగులేయాలని, చేడు స్నేహాలు, సంఘవిద్రోహక శక్తులకు దూరంగా ఉండాలని, ఉన్నత చదువులు చదువుకోవడం ద్వారా బ్రతుకులు బంగారంగా మారుతాయని చెప్పారు. గిరిజన యువకులు వివిధ క్రీడల్లో రానిచేందుకు దుమ్ముగూడెం మండలంలో రూ.2 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నామని. దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రావీణ్యం సాధించిన పలువురిని సన్మానించారు.
ఆకట్టుకున్నాయి ///- ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంప్రదాయ కొమ్మునృత్యాలు, డప్పు వాయిధ్యాలు ప్రత్యేక ఆర్షణగా నిలిచాయి. పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తూ సాగిన ఈ సందడి అందరినీ ఆకట్టుకుంది. ఐటిడిఏ ఆవరణలోని గిరిజన భవన్లో విద్యార్థులు, గిరిజన పెద్దలు, మహిళలతో ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అబ్బుర పరిచాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల పిల్లలు ప్రదర్శించిన పలు రకాల కళారూపాలను తిలకించిన ఎంఎల్ఎ, కలెక్టర్, ఎస్పీ, ఐటిడిఓ పిఓ ప్రశంసలు కురిపించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, డిడి మణమ్మ, ఏసిఎంఓ రమణయ్య, ఏటిడిఓ అశోక్, తానాజీ, భాస్కర్, నాగార్జునరావు, దావీద్, శ్రీనివాస్, గిరిజన సంఘాల నాయకులు ముర్ల రమేష్, పూనెం కృష్ణదొర, పాయం రవివర్మ, గుండి శరత్, మురళీ, పుల్లయ్య, వీరస్వామి, చిచ్చడి శీరామ్మూర్తి, సుధారాణి, అరుణ, వెంకట్రావు, వీరభద్రంతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన గిరిజన సంనాయకులు, గిరిజనులు, విద్యార్ధినీ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1