పీమియం ఫర్నిచర్ స్టోర్ ‘ఫర్నెస్ట్రీ’ ప్రారంభం
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: అత్యాధునిక ప్రీమియం ఫర్నిచర్ స్టోర్ ‘ఫర్నెస్ట్రీ’ మొదటి ఎక్స్‌పీరియన్స్ స్టూడియోని బంజారాహిల్స్‌లో నేడు ప్రారంభించారు. ఇది ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ సందర్భంగా ఫర్నెస్ట్రీ వ్యవస్థాపకురాలు మాన్సీ అలెన్ మాట్లాడుతూ ఇది ఢల్లీి, ఎన్‌సీఆర్ ఆధారిత బ్రాండ్ అన్నారు. కస్టమ్ మేడ్ ప్రీమియం ఫర్నిచర్, ఆర్ట్ పీస్‌లకు ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ స్టూడియోలో కస్టమైజ్డ్ ఫర్నిచర్, వాల్ ఆర్ట్, అధునాతన జపాండి, మెడిటరేనియన్ తదితర గృహాలంకరణలు కలవన్నారు. ఈ స్టూడియోలో ప్రతి భాగం సృజనాత్మకత, ఆవిష్కరణల అద్భుత కళాఖండాలు, స్కాండినేవియన్, జపనీస్ మినిమలిజంను మిళితం చేస్తుందన్నారు.