లెసన్ ప్లాన్స్, డైరీలుఉపాధ్యాయులకు వ్రాయమని చెప్పడం మానుకోవాలి
ఎస్ టి యు డిమాండ్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : పాఠశాలలు సందర్శన సమయంలో జిల్లా, మండల స్థాయి అధికారులు లెసన్ ప్లాన్, డైరీలు రాయాలని ఉపాధ్యాయులకు మానసిక ఒత్తిడికి గురి చేయడం సరైన పద్ధతి కాదని ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు కే జోగారావు అన్నారు. శనివారం స్థానిక అమర్ భవన్ లో ఎస్ టి యు సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వారిని కలిసి డైరీలు, లెసన్ ప్లాన్లు ఉపాధ్యాయులు రాయడం వలన బోధనా సమయం వృధా అవుతుందని తెలియజేయడం జరిగిందన్నారు . పని సర్దుబాటు విషయంలో విద్యాశాఖ అధికారులు రాష్ట్ర డైరెక్టర్ ఇచ్చిన నిబంధనలు మేరకు మండల పరిధిలో సర్దుబాటు చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉపాధ్యాయుల సర్వీస్ పనులు జాప్యం నివారించి సత్వరమే పరిష్కరించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాకు వచ్చి ఆరు నెలలు అవుతున్నప్పటికీ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం నిర్వహించలేదన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి చిప్పాడ సూరిబాబు మాట్లాడుతూ లెసన్ ప్లాన్, డైరీల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు వి గోవిందరావు, జిల్లా కార్యదర్శి ఏ మోహన్ రావు, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. (Story : లెసన్ ప్లాన్స్, డైరీలుఉపాధ్యాయులకు వ్రాయమని చెప్పడం మానుకోవాలి)