Home వార్తలు ఒదెల 2- 800 మంది ఆర్టిస్టులతో  క్లైమాక్స్ షూటింగ్

ఒదెల 2- 800 మంది ఆర్టిస్టులతో  క్లైమాక్స్ షూటింగ్

0

ఒదెల 2- 800 మంది ఆర్టిస్టులతో  క్లైమాక్స్ షూటింగ్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా : తమన్నా భాటియా మోస్ట్ ఎవైటెడ్  సీక్వెల్ ఒదెల-2 కోసం మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌తో కలిసి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వున్నారు. 2021 బ్లాక్‌బస్టర్ హిట్ ఒదెల రైల్వే స్టేషన్‌ సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీని విజనరీ అశోక్ అశోక్ తేజ డైరెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, షెడ్యూల్డ్ వర్కింగ్ వీడియోకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది, సీక్వెల్‌పై ఎక్సయిట్మెంట్ ని పెంచింది.

ప్రస్తుతం, ఈ హైబడ్జెట్ మల్టీ లింగ్వల్ మూవీ  హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలోని ఓదెల మల్లన్న టెంపుల్ లో ఇంటెన్స్ క్లైమాక్స్ షూటింగ్‌తో జరుగుతోంది. అత్యంత కీలకమైన మ్యాసీవ్ టెంపుల్ సెట్ ని హై బడ్జెట్‌తో నిర్మించారు. తమన్నా, ఇతర నటీనటులతో పాటు 800 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

హైదరాబాద్ బోనాలు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చీర కట్టుకుని, తమన్నా భాటియా తలపై బోనం మోస్తూ అద్భుతంగా కనిపించింది. కోఇన్సీడెంట్ గా, బోనాల సంబరాలు జరుగుతున్నప్పుడు బోనాల ఎపిసోడ్‌ను షూట్  చేస్తున్నారు.

తమన్నా భాటియా అద్భుతమైన పెర్ఫార్మెన్  అందించడానికి ఇంటెన్స్ ట్రైనింగ్, రిహార్సల్స్‌ తీసుకున్నారు. యాక్షన్ సన్నివేశాలను పర్ఫెక్ట్ గా చేయడంలో ఆమె డెడికెషన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తాయి.

ఆకట్టుకునే కథాంశంతో ఇంటెన్స్ యాక్షన్‌ని బ్లెండ్ చేయడంలో పేరున్న దర్శకుడు సంపత్ నంది ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సూపర్ విజన్ చేస్తున్నారు. అతని గైడెన్స్ లో, ‘ఓదెల 2‘ ఎమోషన్స్, థ్రిల్స్, అడ్రినలిన్-పంపింగ్ యాక్షన్ సన్నివేశాల రోలర్-కోస్టర్ రైడ్‌ను అందించడానికి రెడీ అవుతోంది.

ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సౌందర్‌రాజన్ డీవోపీ కాగా రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టర్.

నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి (Story : ఒదెల 2- 800 మంది ఆర్టిస్టులతో  క్లైమాక్స్ షూటింగ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version