Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆధార్ వారోత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

ఆధార్ వారోత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

0

ఆధార్ వారోత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

ఎంపీడీవో సాయి మనోహర్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా)

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు మొబైల్ ఆధార్ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, ఈ వారోత్సవాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము తెలిపిన తేదీలలో మొబైల్ క్యాంపులను నిర్వహిస్తూ తగు సూచనలను జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సచివాలయంలో ప్రజలు స్కూల్ పిల్లలు వచ్చేలా చూడాలని తెలిపారు. అదేవిధంగా 0-5 సంవత్సరాలు వయసు కలిగిన వారందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయాలనీ తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్లకు టిఏ తో పాటు డిఏ కూడా మంజూరు చేయబడునని తెలిపారు. 2011 సంవత్సరం నుండి 2016 మధ్యలో ఆధార్ తీసుకోని బడిన, కొత్తగా ఎన్రోల్మెంట్ అయిన వారి డాక్యుమెంట్స్ అప్డేట్ చేయించుకోవాలని తెలిపారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ను సంబంధిత సచివాలయంలోని మహిళ పోలీస్ కార్యదర్శి విధిగా పరిశీలించి సంతకం చేయాలని తెలిపారు. మొబైల్ డిజిటల్ అసిస్టెంట్ల స్థానంలో సదరు సచివాలయంలో వేరే కొరికి డిజిటల్ అసిస్టెంట్ ఇంచార్జ్ కూడా ఇవ్వాలని తెలిపారు. ఈ ఆధార్ వారోత్సవాల్లో ప్రతి సచివాలయంలో పంచాయితీ కార్యదర్శి టీం లీడర్ గా మహిళా పోలీస్ వారు పరిశీలన అధికారిగా డిజిటల్ అసిస్టెంట్ కన్వీనర్ గా ఉండాలని తెలిపారు.కావున ప్రతి సచివాలయంలో కూడా ఈ మొబైల్ ఆధార్ వారోత్సవాలను తప్పనిసరిగా విజయవంతం చేసేలా సమన్వయంతో తమ విధులను నిర్వర్తించాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ ఈ షెడ్యూల్ తేదీలను సదరు గ్రామాలలో టామ్ టామ్ ద్వారా విస్తృత ప్రచారం కూడా చేయాలని తెలిపారు. మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీలలో ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, తేదీలవారీగా సేవలు ప్రజలకు అందించబడునని తెలిపారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి ద్వారా0-5 సంవత్సరం లోపు వయసు ఉన్న విద్యార్థులకు అందరూ ఆధార్ అప్డేట్ తప్పక చేసుకునే విధంగా పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారాన్ని అందించాలని కూడా వారు తెలిపారు. తదుపరి వెలుగు ఏపీఎం మహిళా సంఘాల సభ్యులు సూపర్వైజర్లు ఐసిడిఎస్ ల పరిధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో ఎంజిఎన్ఆర్ఇజిఎస్ వారు తమ ఉపాధి హామీ కూలీలకు తప్పక ఆధార్ అప్డేట్ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వారు తెలిపారు. కావున ఈ అవకాశాన్ని గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. (Story : ఆధార్ వారోత్సవాలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version