ఎస్.పి రావుల గిరిధర్ గారిని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కొత్త ఎస్.పిగా బాధ్యతలు చేపట్టిన రావుల.గిరిధర్ కి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధులతో కలసి వారిని ఎస్.పి గారికి పరిచయం చేస్తూ మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. లక్ష్మిపల్లి గ్రామములో ఇటీవల హత్యకు గురైన బి.ఆర్.ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి విషయములో శ్రద్ధతో విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్.పి గారు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు. (Story : ఎస్.పి రావుల.గిరిధర్ గారిని మర్యాదపూర్వకంగా కలసిన మాజీ మంత్రి)