Home జీవనశైలి ఆరోగ్యం డెంగ్యూను అడ్డుకోవ‌చ్చు…ఎలా అంటే? ఓ క‌న్నేయండి!

డెంగ్యూను అడ్డుకోవ‌చ్చు…ఎలా అంటే? ఓ క‌న్నేయండి!

0

డెంగ్యూను అడ్డుకోవ‌చ్చు…ఎలా అంటే? ఓ క‌న్నేయండి!

డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అపోలో క్రెడిల్చిల్డ్రన్స్ హాస్పిటల్ (కొండాపూర్) కన్సల్టెంట్ శిశు వైద్యులు అవష్ పాణి తెలిపారు. ఇది వర్షాకాలంలో అధికంగా వ్యాపిస్తుందన్నారు. డెంగ్యూ అనేది వైరల్ ఇన్‌ఫెక్షన్ అన్నారు. డెంగ్యూ వస్తే జ్వరం, ఒళ్లు నొప్పులు, వాంతులు, కడుపు నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయన్నారు. కొన్నిసార్లు డెంగ్యూ జ్వరంతో పాటు వచ్చే తీవ్రమైన ఒళ్లు నొప్పులు కారణంగా దీనిని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారన్నారు. ఈ వ్యాధి సోకిన దోమల నుంచి మనుషులకు వ్యాపిస్తుందన్నారు. అందుకే భారతదేశంలో దోమల బెడద ఎక్కువగా ఉన్న వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. నివారణకు ప్రారంభ చికిత్స చాలా ముఖ్యమన్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

లక్షణాలు: అత్యధిక రోగులు సాధారణంగా ఏదైనా వైరల్ జ్వరంతో తేలికపాటి లక్షణాలతో ఉంటారన్నారు. కొంతమంది రోగులకు సెలైన్ ఇన్ఫ్యూషన్ కోసం మాత్రమే ఆసుపత్రి అవసరం ఉంటుందన్నారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో కొద్దిమందికి మాత్రమే డీహైడ్రేషన్ డెవలప్ చేయవచ్చన్నారు. ఇది రక్తం థిక్నెస్ పెరగడానికి దారితీస్తుందన్నారు. దీని వల్ల అవయవాలు ప్రభావితమవుతాయన్నారు. దీంతో ఇంటెన్సివ్ కేర్ అవసరం అవుతుందని తెలిపారు.

డెంగ్యూ జ్వరం లక్షణాలు సాధారణంగా దోమ కుట్టిన నాలుగు నుంచి పది రోజుల తర్వాత ప్రారంభమవుతాయని తెలిపారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ళ వెనుక నొప్పి, కీళ్లు, కండరాల నొప్పి, వికారం, వాంతులు, అలసట ఉంటాయన్నారు. స్కిన్ రాష్, ఇది జ్వరం వచ్చిన కొన్ని రోజుల తర్వాత కనిపించవచ్చని పేర్కొన్నారు. తేలికపాటి రక్తస్రావం (ముక్కు రక్తస్రావం, చిగుళ్ళలో రక్తస్రావం లేదా సులభంగా గాయాలు వంటివి) ఉంటుందన్నారు. తీవ్రమైన సందర్భాల్లో.. డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌గా అభివృద్ధి చెందుతుందని, ఇది ప్రాణాంతకం కావచ్చని తెలిపారు.

వ్యాధి నిర్ధారణ: డెంగ్యూ జ్వరం లక్షణాలు, ప్రయాణ చరిత్ర, ఆ ప్రాంతంలో డెంగ్యూ జ్వరం, ప్రయోగశాల పరీక్షల ఆధారంగా నిర్ధారణ చేయబడుతుందన్నారు.

చికిత్స: డెంగ్యూ జ్వరానికి నిర్దిష్ట యాంటీవైరల్ చికిత్స లేదన్నారు. వ్యాధి నిర్వహణలో ప్రధానంగా సహాయక సంరక్షణ ఉంటుందన్నారు.

  1. లక్షణాలను ముందుగానే గుర్తించండి:సాధారణ లక్షణాలు, జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం (ముక్కు లేదా గమ్ బ్లీడ్ వంటివి) ఉంటాయన్నారు.
  2. వైద్యులను సంప్రదించండి:పిల్లలలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే సరైన రోగ నిర్ధారణ కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.

ఇంట్లో సంరక్షణ‌: డీహైడ్రేషన్ నివారించడానికి విశ్రాంతి అవసరమన్నారు. పానీయాలు తాగించాలన్నారు.

  1. మానిటర్ లక్షణాలు:పిల్లల లక్షణాలపై నిఘా ఉంచాలన్నారు. తీవ్రమైన డెంగ్యూ హెచ్చరిక సంకేతాలు (తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, వాంతులు, వేగవంతమైన శ్వాస, చిగుళ్ళలో రక్తస్రావం, అలసట, విశ్రాంతి లేకపోవడం వంటివి) కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు.
  2. మెడిసిన్:జ్వరం, నొప్పి ఉపశమనం కోసం వైద్యులు సిఫార్సు చేసిన విధంగా పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్) ఉపయోగించాలన్నారు. ఇతర నొప్పి నివారణ మందులకు దూరంగా ఉండాలన్నారు.
  3. హాస్పిటల్ కేర్: తీవ్రమైన డెంగ్యూకి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్,రక్తమార్పిడికి వైద్యుల పర్యవేక్షణ కోసం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందన్నారు.

డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోతుందని సాధారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్లేట్‌లెట్స్ నిజంగా తక్కువగా ఉంటే తప్ప సాధారణంగా డెంగ్యూలో సమస్య ఉండదన్నారు. ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచే మందులు అవసరం లేదన్నారు. రికవరీతో ప్లేట్‌లెట్ కౌంట్ క్రమంగా పెరుగుతుందని తెలిపారు.

డెంగ్యూ నివారణకు చిట్కాలు

  1. దోమ కాటును నివారించండి:

క్రిమి వికర్షకాలను ఉపయోగించండి: చర్మంపై డీఈఈటీ, పికారిడిన్ లేదా నిమ్మ యూకలిప్టస్ నూనె రాయాలన్నారు. వీటిని రెగ్యులర్ గా కాకుండా పొదుపుగా వాడాలన్నారు.

రక్షిత దుస్తులు ధరించండి: పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంట్‌లు, సాక్స్‌లు, బూట్లు ధరించాలన్నారు. ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే సమయాల్లో (ఉదయం, మధ్యాహ్నం) జాగ్రత్తగా ఉండాలన్నారు.

దోమ తెరలను ఉపయోగించండి: పిల్లలు దోమతెరల కింద పడుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ పని చేయాలన్నారు. తలుపులు, కిటికీలు, బాల్కనీలు మొదలైన వాటిలో స్లైడింగ్ దోమల మెష్లను ఉపయోగించాలన్నారు.

  1. బ్రీడింగ్ సైట్‌లను తొలగించండి

నిలువ నీటిని తొలగించండి: దోమలు నిలువ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయన్నారు. ఫ్లవర్‌పాట్‌లు, బకెట్‌లు, పక్షుల స్నానాలు వంటి కంటైనర్‌లను క్రమం తప్పకుండా ఖాళీ చేయాలన్నారు. శుభ్రంగా ఉంచాలన్నారు.

కవర్ వాటర్ స్టోరేజ్: దోమల ప్రవేశాన్ని నిరోధించడానికి నీటి నిల్వ కంటైనర్లు సరిగ్గా కప్పాలన్నారు.

పరిశుభ్రతను కాపాడుకోండి: పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను పారవేయాలన్నారు. చెత్త కుప్పల్లోని చిన్న కంటైనర్లు, యాదృచ్ఛిక వస్తువులు కూడా నీటిని నిల్వ చేస్తాయన్నారు. ఇవి దోమల ఉత్పత్తికి దారితీస్తాయన్నారు.

3.దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలి

క్రిమి సంహారక స్ప్రేలను ఉపయోగించండి: దోమలను చంపడానికి, తిప్పికొట్టడానికి క్రిమి సంహారక స్ప్రేలు, మస్కిటో కాయిల్స్ ఇంటి లోపల ఉపయోగించవచ్చన్నారు. ఈ పదార్ధాలలో ఉన్న రసాయనాల మితిమీరిన వినియోగం నుంచి హానిని నివారించడానికి వీటిని తెలివిగా ఉపయోగించాలన్నారు.

4.విద్య

పిల్లలకు బోధించండి: దోమ కాటుకు దూరంగా ఉండటం, తమను తాము ఎలా రక్షించుకోవాలో పిల్లలకు నేర్పాలన్నారు.

కమ్యూనిటీ అవేర్‌నెస్: దోమల బెడదను తగ్గించడం, డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కమ్యూనిటీ కార్యక్రమాలలో పాల్గొనాలన్నారు. ఈ నివారణ చర్యలతో లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను డెంగ్యూ నుంచి రక్షించడంలో సహాయపడగలరని తెలిపారు. అవసరమైతే సత్వర చికిత్సను అందించగలరని పేర్కొన్నారు.

– అపోలో క్రెడిల్, చిల్డ్రన్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ శిశు వైద్యులు అవష్ పాణి

(Story in English)

What is Dengue fever?
Symptoms, Diagnosis, Treatment & Prevention tips

Dengue is viral infection that can cause symptoms like fever, body pain, vomiting and tummy
pain etc. It is sometimes called break bone fever due to the severe body pain which sometimes
accompanies dengue fever. The disease is transmitted to humans through bite of infected
mosquitos. That is why dengue prevalence is more in the rainy season in India when mosquito
menace is more. Prevention and early treatment are crucial, especially for children.
Symptoms
Majority of the patients remain normal or with mild symptoms like any other viral fever. Few
patients only require hospitalization for saline infusion. Very few out of the hospitalized patients
may develop dehydration leading to increased thickness of the blood which causes organs to
be affected and require intensive care.
Symptoms of dengue fever typically begin four to ten days after being bitten by an infected
mosquito and can include:
 High fever
 Severe headache
 Pain behind the eyes
 Joint and muscle pain
 Nausea and vomiting
 Fatigue
 Skin rash, which may appear a few days after the fever
 Mild bleeding (such as nosebleeds, gum bleeding, or easy bruising)
In severe cases, dengue can develop into dengue severe or dengue shock syndrome, which
can be life-threatening.
Diagnosis
Dengue fever is diagnosed based on symptoms, travel history, dengue fever incidence in the
area, and laboratory tests.
Treatment
There is no specific antiviral treatment for dengue fever. Management of the disease primarily
involves supportive care
1. Recognize Symptoms Early:
Common Symptoms: Fever, headache, muscle and joint pain, rash, and mild bleeding (such
as nose or gum bleed).
2.Seek Medical Attention: If a child shows symptoms of dengue, consult a healthcare
provider immediately for proper diagnosis and management.
Home Care:
Rest and Hydration: Ensure the child gets plenty of rest and drinks fluids to prevent
dehydration.
3.Monitor Symptoms: Keep an eye on the child's symptoms and seek medical help if they
worsen or if warning signs of severe dengue (such as severe abdominal pain, vomiting, rapid
breathing, bleeding gums, fatigue, and restlessness) appear.
4.Medication:

Use Paracetamol: For fever and pain relief, use paracetamol (acetaminophen) as
recommended by a healthcare provider. Avoid other pain relief medications.
5.Hospital Care:
Seek Hospitalization: Severe dengue may require hospitalization for intravenous fluids,
blood transfusions, and close monitoring by healthcare professionals.
Please note that commonly people are worried about the dropping platelet count in dengue
fever. Unless the platelets are really low it usually is never the problem in dengue. Medications
that re supposed to increase platelet counts are not required. Platelet count gradually increase
on its own with recovery
Prevention tips
1.Avoid Mosquito Bites:
Use Insect Repellents: Apply repellent with DEET, picaridin, or oil of lemon eucalyptus on
exposed skin. These should be used sparingly and not on a regular basis.
Wear Protective Clothing: Dress children in long-sleeved shirts, long pants, socks, and
shoes, especially during peak mosquito hours (early morning and late afternoon).
Use Mosquito Nets: Ensure children sleep under mosquito nets, especially in areas where
dengue is prevalent.
Use sliding mosquito mesh panes in doors, windows, balconies etc.
2.Eliminate Breeding Sites:
Remove Stagnant Water: Mosquitoes breed in standing water. Regularly empty and clean
containers like flowerpots, buckets, and bird baths.
Cover Water Storage: Ensure all water storage containers are properly covered to prevent
mosquito access.
Maintain Cleanliness: Keep your surroundings clean and ensure proper disposal of garbage.
Small containers and random objects in garbage dumps also store water and leads to breeding
of mosquitoes.
3.Use Mosquito Control Measures:
Use Insecticide Sprays: Insecticide fumigation sprays and mosquito coils can be used
indoors to kill and repel mosquitoes. These should be used judiciously to avoid potential harm
from overuse of the chemicals present in these materials.
4.Education
Educate Children: Teach children about the importance of avoiding mosquito bites and how
to protect themselves.
Community Awareness: Participate in community programs aimed at reducing mosquito
populations and spreading awareness about dengue prevention.
By taking these preventive measures and recognizing symptoms early, parents can help protect
their children from dengue and ensure prompt treatment if needed.
Dr Avash Pani
Consultant Pediatrician
Apollo Cradle and Children’s Hospital
Kondapur Hyderabad.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version