జర్నలిస్టులను బెదిరిస్తే సహించం
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ
న్యూస్‌తెలుగు/వినుకొండ : జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్ రావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమను కలిసిన జర్నలిస్టు సంఘాలతో వారు పాత్రికేయ సమస్యలపై చర్చించారు. అది పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సానుకూలంగా స్పందిస్తామని, దాడులకు పాల్పడినవారిపై శిక్షలు కఠినతరం చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు జర్నలిస్టు సంఘాలకు సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. (Story : జర్నలిస్టులను బెదిరిస్తే సహించం)