వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ
న్యూస్‌తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : బెజ్జూర్ మండలంలోని తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాల వరద బాధితులకు బిజెపి నాయకులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు వరద బాధితులకు మాజీ ఎంపీపీ పాల్వాయి సుధాకర్ రావు 150 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. గత వారం రోజులుగా ప్రాణహిత వరద ప్రవాహంతో ఇంట్లో నుండి బయటకు వెళ్లలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారన్న విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు గ్రామాలకు వెళ్లి ఇంటింటికి తిరిగి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. వరద ప్రవాహంతో పంటలు నీట మునిగి పంటలు నష్టపోయాయని నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, సామల తిరుపతి, తాళ్ల రామయ్య, కుమ్మరి తిరుపతి,రాజారాం, సంతోష్,తదితరులు పాల్గొన్నారు.