Home వార్తలు  “క” సినిమా తెలుగు రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న  వంశీ నందిపాటి

 “క” సినిమా తెలుగు రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న  వంశీ నందిపాటి

0

 “క” సినిమా తెలుగు రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న  వంశీ నందిపాటి

న్యూస్‌తెలుగు/సినిమా హైద‌రాబాద్‌ :యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క” తెలుగు స్టేట్స్ రైట్స్ సొంతం చేసుకున్నారు సక్సెస్ పుల్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి. ఆయన ఈ సినిమాను 12 కోట్ల రూపాయలకు ఎన్ఆర్ఐ బేసిస్ లో హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా ఇతర భాషల థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ డీల్ దాదాపు 18 కోట్ల రూపాయల దగ్గర క్లోజ్ అయ్యేలా ఉంది. దీంతో 30 కోట్ల రూపాయలపైనే “క” సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం.

“క” సినిమా పట్ల ట్రేడ్ సర్కిల్స్ లో ఏర్పడిన క్రేజ్ కు ఈ డీల్ నెంబర్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తోంది. “క” సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులు (Story :  “క” సినిమా తెలుగు రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న  వంశీ నందిపాటి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version