Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా

పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా

0

పార్టీలు మారినంత మాత్రాన చేసిన

అభివృద్ధి నిజం కాకుండా పోతుందా

న్యూస్‌తెలుగు/వనపర్తి: పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కె.సి.ఆర్ గారిది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం తన స్వగృహంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి 90శాతం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన 10శాతం పూర్తి చేయలేని అసమర్థత ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని దుయ్యబట్టారు.

సాగునీరు కోసం,రైతు రుణమాఫీ కోసం,రైతు భరోసా కోసం రైతులు పడుతున్న కష్టాలు కళ్ళకు కట్టినట్లు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వివరించారు. యాసంగి సీజన్ లో ఉమ్మడి పాలమూర్ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు ఎలా ఇవ్వాలన్నదే నీటి పారుదల శాఖ మంత్రి బాధ్యత తీసుకుని నీళ్లు ఎన్ని ఉన్నాయి ఎంత స్టోరేజ్ ఉంది అని రైతులకు ముందే తెలిపాలని అన్నారు. రికార్డ్ స్థాయిలో వర్షాలు పడ్డాయి 35 రోజులు పాటు ఏడతెరిపిలేని వర్శాలుపడి పై నుండి వరద రావడం వల్ల చాలా దాదాపు 25,30టి ఎం సిల నీళ్ళు సముద్రం పాలు అయినాయి.
నీళ్లు ఎలా ఒడిసి పట్టుకోవాలి తెలియదు ఇరిగేషన్ బోర్డ్ సమావేశం పెట్టకుండా ఒక డిప్యుటీ తో ప్రకటన ఇప్పిస్తారు జూరాల లో నీళ్లు లేవు కాబట్టి యాసంగీకి నీళ్ళు ఇవ్వలేమని, రామన్ పాడు వరకు మాత్రమే నీళ్లు ఇస్తామనీ చెబుతున్నారు. జూరాల నుండి కొడనగల్ కు ఎత్తిపోతల పథకం వెస్ట్ అని ఆలోచన రహితం అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కె సి ఆర్ మొదలు పెట్టిన పని నుండి నీళ్లు ఇస్తే పేరు వస్తుందని పట్టుదల అవసరం లేదు ప్రజల పక్షాన ఆలోచన చేయండి అని అన్నారు. కె.సి.ఆర్ అంచనా ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా బీమీ ద్వారా 2 లక్షలు, కోయిల సాగర్ ద్వారా 40 వేలు కొడంగల్ లిఫ్ట్ కాకుండా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వొచ్చు అని అన్నారు.ప్రభుత్వ అసమర్తవల్ల వరద నీళ్లు లేకపోతే యాసంగి కి నీళ్లు ఉండవు అని విమర్శించారు. పక్క నియోజకవర్గం లో ఫోటోలు పెట్టుకునే సంబరం తప్ప జూపల్లికి ప్రజలకు మంచి ఆలోచన చేయాలన్న ఆలోచన లేదు అని అన్నారు. ఉత్తమ్ కుమార్ ఉత్తిత్తి మాటలు… గతంలో జూపల్లియే చెప్పాడు 1984 నుండి 2004 కల్వకుర్తి పథకం మీద కేవలం 12 కోట్లు ఖర్చు పెట్టారు అని బి ఆర్ ఎస్ లో ఉన్నప్పుడు 100 సార్లు మాట్లాడారు.కె.సి.ఆర్, హరీష్ రావు వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి నీళ్లు ఇచ్చారాని ఎన్నో సార్లు చెప్పావు. కానీ ఇప్పుడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని ఇస్తే రాజీనామా చేస్తావు అన్నారు కదా రాజీనామా మీ విజ్ఞత కు వదిలిపెడుతున్నాం అని అన్నారు. బిఅర్ ఎస్ పార్టీలో ఉండి మంత్రి పదవులు అనుభవించినప్పుడు తెలియదా అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేక పోయావు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వెళ్లి మంత్రి పదవి వచ్చిన తరువాత ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు అని చెప్పడానికి సిగ్గు అనిపిస్తలేదా… అని ఘాటుగా విమర్శించారు.
2016 లో అప్పటి నీటి పారుదల శాఖమంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు అప్పటి మంత్రి జూపల్లి మాట్లాడిన వీడియో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చూయించారు. గత ప్రభుత్వం హయాంలో పాలమూర్ పంటలకు నీళ్లు అందిచలేకపోవడం వల్ల పంటలు పండక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 20 ఏండ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న మీరు
కాంగ్రెస్ లో ఉంటే పని జరిగినట్లు లేకపోతే వేరే పార్టీ లో ఉంటే పనులు కానట్లు మాట్లాడడం అంటే కొంచెమైన ఇంగితం ఉండాలి కదా…..అని అన్నారు. జొన్నలగడ్డ రిజర్వాయర్ వద్ద అప్పటి మంత్రి జూపల్లి మీడియా సమావేశంలో మాట్లాడిన వీడియోతో అది గత పాలకులు నీళ్లు ఇవ్వలేదు అని ప్రస్తుతం చెబుతున్నారు కదా,గత ప్రభుత్వంలో మంత్రిగా వెలగబెట్టిన మీరు అసమర్తులు అన్నట్లా అని ఎద్దేవా చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం లో 2014 కన్నా ముందు కేవలం 4 టి ఎం సి లు ఇచ్చారని అదే కె సి ఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత సంవత్సరంకు 40 టి ఎం సి ల నీళ్లను ఎత్తిపోయడం జరిగింది. రికార్డ్ ఉంటుంది. ఒక్క ఎకరాకు నీళ్లు బి అర్ ఎస్ ప్రభుత్వం ఇస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు మేము రాజీనామా చేయమని చెప్పము మీకు సిగ్గు అనిపిస్తే మీరు రాజీనామా చేయండి… రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం… పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంత మేలు చేసాము అన్నది ముఖ్యం… మంత్రి గా నీవు ఉన్నప్పుడు నేను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఉండి అందరు కలికి కదా పని చేసి నీళ్లు ఇచ్చాము కదా పార్టీ మారితే నిజాలు అబద్దాలు మాట్లాడితే ఎలా….
కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం లో వనపర్తి నియోజకవర్గం లేదు అయిన ఒప్పించి నీళ్ళు తెచ్చామని అన్నారు. గొంతులు తెగిన పరవాలేదు అని తెలంగాణ కోసం కొట్లాడినం అని చోట మోట నాయకులు తో మాట్లాడితే ఎక్కడ ఎవరు బెదరారు అని అన్నారు. కె ఎల్ ఐ కింద అదనపు రిజర్వాయర్ మీద దృష్టి పెట్టండి, పాలమూర్ రంగారెడ్డి ను నీటి పారుదల శాఖ మంత్రి సందర్శించకుండా ఎదో మాట్లాడుతారు
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ బి ఆర్ ఎస్ ఎందులో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే లు అందరు కలిసి పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం టన్నెల్, రిజర్వాయర్ లను పరిశీలన చేయండి ఎం చేస్తే ప్రజలకు నీళ్లు ఎలా అందించాలో ఆలోచన చేయకుండా నీళ్లు అడిగితే బట్టలు ఉడగొడుతాం అంటారు పాలన చేస్తున్నారా లేక రౌడీ ఐజం చేస్తున్నారా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆదాయం ఎంత అప్పు ఎంత అని వనరులు ఎట్లా పెంచుకోవాలని చూసుకున్నాక ఎన్నికల హామీలు ఇవ్వాలి నోటికి వచ్చినట్లు హామీలు ఇవ్వకూడదని హితవు పలికారు. కల్వకుర్తి పథకంలో ముఖ్యమంత్రి ని ఒప్పిచి పెంచుకున్నాము కాబట్టి ఇప్పటికే ఆంధ్ర వాళ్లు ఏడుస్తున్నారు.
ఈ సమావేశములో బి.లక్ష్మయ్య,వాకిటి.శ్రీధర్,కురుమూర్తి యాదవ్,కృష్ణా నాయక్,ఎద్దుల.కరుణశ్రీ,వనం.రాములు,విజయ్ కుమార్ ,పృథ్విరాజ్,జనాధం నాయుడు,తిరుపతయ్య,బాలరాజు, నందిమల్ల.అశోక్,మాణిక్యం,చంద్రశేఖర్ నాయక్,జాత్రూ నాయక్,రాజశేఖర్,దిలీప్ రెడ్డి,మతీన్,చిట్యాల.రాము,సునీల్ వాల్మీకి,రమేష్,మంద.రాము తదితరులు పాల్గొన్నారు. (Story : పార్టీలు మారినంత మాత్రాన చేసిన అభివృద్ధి నిజం కాకుండా పోతుందా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version