అంకురం ప్రారంభించిన సమగ్ర శిక్ష తెలంగాణ, ఉద్యమ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి గ్రేడ్ 11 విద్యార్థుల కోసం అంకురం బిజినెస్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రామ్, గ్రేడ్ 9 విద్యార్థుల కోసం అంకురం ఎంట్రప్రెన్యూరియల్ మైండ్‌సెట్ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లోని టి-హబ్‌లోని అంకురం ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం తెలంగాణలోని 33 జిల్లాల్లోని 409 పాఠశాలల్లోని గ్రేడ్ 11 మరియు గ్రేడ్ 9 విద్యార్థులలో వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించడంతోపాటు 21వ శతాబ్దపు నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. గత సంవత్సరం 35 పాఠశాలల నుండి 2,800 మంది విద్యార్థులు పాల్గొనటంతో కార్యక్రమం విజయవంతమైందని వెల్లడిరచారు. గ్రేడ్ 11కు చెందిన విద్యార్థుల టాప్ 20 వ్యాపార ఆలోచనలు ప్రదర్శించబడ్డాయి. సమగ్ర శిక్షా తెలంగాణ నుండి 995 మంది విద్యార్థులు సీడ్ మనీని అందుకున్నారు. ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, ఇంక్విలాబ్ ఫౌండేషన్, వై-హబ్, ఓక్‌నార్త్ భాగస్వామ్యంతో సమగ్ర శిక్షా తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 200 మందికి పైగా హాజరయ్యారు. (Story : అంకురం ప్రారంభించిన సమగ్ర శిక్ష తెలంగాణ, ఉద్యమ్)