వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన 3 ఆహార పదార్ధాలు
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి కచ్చితంగా తినాల్సిన మూడు ఆహార పదార్థాలను పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్ వెల్లడిరచారు. రోజువారీ భోజనంలో బాదం, తాజా పండ్లు, కాలానుగుణ కూరగాయలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు. బాదంపప్పులు చిన్నవిగా కనిపించవచ్చు, కానీ వాటిలో రాగి, జింక్, ఫోలేట్, ఐరన్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. అలాగే, యాపిల్స్, దానిమ్మపండ్లు, బెర్రీలు, అరటిపండ్లు వంటి తాజా పండ్లలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కూరగాయల సూప్‌తో సులభంగా జీర్ణం అవుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లం, తులసి, లెమన్‌గ్రాస్ టీలు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇక తినకూడని ఆహార పదార్థాల్లో జంక్ ఫుడ్, నిల్వ లేదా మిగిలిపోయిన ఆహారం వంటివి ఉన్నాయి.(Story:వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన 3 ఆహార పదార్ధాలు)