రాయిటర్స్ విజన్ 2045 ప్రచారంలో వెల్‌స్పన్ లివింగ్
న్యూస్‌తెలుగు/ముంబయి: పర్యావరణ అనుకూల గృహ పరిష్కారాలనందించటంలో అగ్రగామిగా ఉన్న వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్, ప్రతిష్టాత్మకమైన రాయిటర్స్ ‘విజన్ 2045’ ప్రచారంలో భాగమైనట్లు వెల్లడిరచింది. 2045లో ఐక్యరాజ్యసమితి శతాబ్ది ఉత్సవాల అంతర్జాతీయ వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. పరివర్తన కలిగించే పద్ధతులు, గణనీయమైన సామాజిక ప్రభావం చూపటం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే సంస్థలను గుర్తించడానికి విజన్ 2045 అంకితం చేయబడిరది. ఈ ప్రతిష్టాత్మక ప్రచారంలో వెల్‌స్పన్ లివింగ్ పాత్ర, పర్యావరణ అనుకూలత, సామాజిక బాధ్యతలో ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పాలనే దాని నిబద్ధతను వెల్లడిస్తుంది. ఈ ప్రచారంలో సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ (ఎస్‌డిజి) దిశగా గణనీయమైన పురోగతిని సాధిస్తున్న మరియు యుఎన్ ఎస్‌డిజి లక్ష్యాలకు సానుకూలంగా దోహదపడే వ్యాపారాలను చూపే అద్భుతమైన డాక్యుమెంటరీ సిరీస్ భాగంగా ఉంటుంది. (Story : రాయిటర్స్ విజన్ 2045 ప్రచారంలో వెల్‌స్పన్ లివింగ్)
