Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వి సి బి ఏ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుల హవా

వి సి బి ఏ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుల హవా

0

వి సి బి ఏ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుల హవా

న్యూస్‌తెలుగు/విజ‌య‌న‌గ‌రం :విజయనగరం టౌన్ పట్టణంలో ఉన్న డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో ఈనెల 18 నుండి 21 వరకు జరిగిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్, సెలక్షన్స్ పోటీలలో విజయనగరం సిటీ షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు అన్ని విభాగాలలోను హవా కొనసాగినట్లు కోచ్ జి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం డి ఎస్ ఎస్ స్టేడియంలో వి సి బి ఏ అధ్యక్షులు డాక్టర్ వి ఎస్ ప్రసాద్ కార్యదర్శి, నున్న సురేష్ లు గెలుపొందిన రు క్రీడాకారులకు అభినందన సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు డాక్టర్ కె ఏ నాయుడు, కార్యదర్శి నున్నా సురేష్ లను దుస్సాలతో డాక్టర్ వి.ఎస్ ప్రసాద్, ఎం కె బి శ్రీను , ఎస్.మల్లికార్జున రావు ఇతర సభ్యులు సన్మానించారు. అనంతరం క్రీడాకారులను అభస్తూ వీరికి మంచి శిక్షణను ఇచ్చిన కోచ్ జి శ్రీనివాసరావును అభినందిస్తూ త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మరింతగా శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి క్రీడాకారులుగా తయారు చేయాలని ఆకాంక్షించారు.(Story: వి సి బి ఏ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారుల హవా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version