బెర్గ్నర్‌తో చేతులు కలిపిన సెలెబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా
న్యూస్‌తెలుగు/హైదరాబాద్: కుక్‌వేర్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెర్గ్నర్ ఇండియా తన ప్రచారకర్త అయిన చెఫ్ వికాస్ ఖన్నాతో హైదరాబాద్‌లో తన సరికొత్త శ్రేణి బెర్గ్నర్‌ని ప్రారంభించింది. ట్రై-ప్లై, కాస్ట్ ఐరన్ అండ్ అడ్వాన్స్‌డ్ సిరామిక్ కోటెడ్ నాన్ స్టిక్ కుక్‌వేర్ వంటి విషపదార్థ రహిత పదార్థాలను ఉపయో గించి ఆరోగ్యకరమైన వంట పరిష్కారాలపై దృష్టి సారించడం ద్వారా బెర్గ్నర్ ఇండియా వంటలు చేయడంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన బెర్గ్నర్ ఎసెన్షియల్స్ శ్రేణి ఈ శ్రేణి నిర్మాణం, సంప్రదాయ ఆకృతులపై దృష్టి సారించడం ద్వారా భారతీయ ప్రాంతీయ వంటల విభిన్న అవసరాలను తీర్చడానికి కచ్చితమైన రీతిలో రూపకల్పన చేయబడిరది. ట్రై-ప్లై నిర్మాణం వేడి పంపిణీని నిర్ధారిస్తుంది, తద్వారా సంప్రదాయ భారతీయ వంట కాలు వాటి ప్రామాణిక రుచులను సంరక్షించడాన్ని సులభతరం చేస్తుంది. ప్రీమియం నాణ్యత కలిగి ఉన్న ప్పటికీ, ఈ శ్రేణి సరసమైన ధరను కలిగి ఉంటుంది. ప్రతి ఇంటికి ఉత్తమమైన వంటసామగ్రి, ఆరోగ్యకరమైన వంటలను అందుబాటులో ఉంచుతుంది. (Story : బెర్గ్నర్‌తో చేతులు కలిపిన సెలెబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నా)