నగరపాలక కార్యాలయంలో ప్రజా వినితుల పరిష్కార వేదిక
న్యూస్‌తెలుగు/ విజయనగరం టౌన్: సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక నకు 14 వినతులు వచ్చాయి. పలువురు తమ సమస్యలను వెల్లడిస్తూ వినతి పత్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు నకు అందజేశారు. ఆయా వినతుల పరిష్కారానికై సంబంధిత విభాగ అధికారులకు కమిషనర్ ఆదేశించారు.టౌన్ ప్లానింగ్ విభాగానికి 5 ,ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 4, శానిటేషన్ కు సంబంధించి 2, రెవెన్యూ సంబంధించి 1,మెప్మా సంబంధించి 1, సచివాలయం నకు సంబంధించి 1 చొప్పున వినతులు అందాయి. సిబ్బంది వినతులను స్వీకరించిన కమిషనర్ ఎంఎం నాయుడు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రజల నుండి వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు మధుసూదన రావు,అమ్మాజీ రావు, ఈఈ కే.శ్రీనివాసరావు, మేనేజర్ ప్రసాదరావు,టిపిఆర్ ఓ. సింహాచలం, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. (Story : నగరపాలక కార్యాలయంలో ప్రజా వినితుల పరిష్కార వేదిక)