జామియా మస్జీద్ స్థలం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
న్యూస్‌తెలుగు/వనపర్తి :వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో జామియా మస్జీద్ స్థలం ఏర్పాటు కోసం శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ. 1,50,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా రేవల్లి ముస్లిం మైనారిటీ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు, సత్యశీలరెడ్డి, జామియా మాస్జీద్ కమిటీ అధ్యక్షులు షఫీ అహ్మద్ గారు, యమ్ డి ఖాదర్ పాషా, యమ్ డి, అజీమ్ పాషా, సలీం, షాబుద్దీన్, మహబూబ్, హబీబ్, తదితరులు, పాల్గొన్నారు. (Story : జామియా మస్జీద్ స్థలం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఆర్థిక సహాయం)