కె.ఎల్. ఐ పంపులను ప్రారంభించి ఆయకట్టుకు నీళ్ళు వదలాలి
ఇంజినీర్ ఇన్ చీఫ్(ఇరిగేషన్)కిఫోన్ చేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి:
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి E.N.C ఇరిగేషన్ అనిల్ కుమార్ తో ఫోన్లో మాట్లాడుతూ కె.ఎల్. ఐ పంపులను వెంటనే ప్రారంభించి ఆయకట్టుకు నీళ్ళు వదలాల్సిందిగా కోరారు. ఒక్కరోజు ఆలస్యమైనా ఒక టి.ఎం.సి మనం నష్టపోతామని అని పైగా కృష్ణాకు ఎప్పుడు పైనుంచి నీళ్ళు వచ్చినా మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రజాప్రతినిధులను,అధికారులను అప్రమత్తం చేసిఉమ్మడి జిల్లాలోని అన్ని పంపులు ప్రారంభిపజేసేవారు. అందువల్ల కె.ఎల్. ఐ పంపులను తక్షణం ప్రారంభించి నీళ్ళు వదలాలని కోరారు.అలాగే పాలమూరు పంపుతో నార్లాపూర్ నింపడం ప్రారంభించాలిసిందిగా సూచించడం జరిగింది స్పందించిన E.N.C వెంటనే చర్యలు తీసుకొంటామని అన్నారు. (Story : కె.ఎల్. ఐ పంపులను ప్రారంభించి ఆయకట్టుకు నీళ్ళు వదలాలి)