Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఇంజ‌నీరింగ్ అడ్మిష‌న్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ఇంజ‌నీరింగ్ అడ్మిష‌న్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

0
AP EAPCET
AP EAPCET

ఇంజ‌నీరింగ్ అడ్మిష‌న్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌!

ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలకు 22 చివరి తేది
రిపోర్టింగ్ పూర్తి చేయకుంటే సీటు రద్దు
సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య

న్యూస్‌తెలుగు/అమ‌రావ‌తి: ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను 22వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్దేశించిన తేదీని ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులు రిపోర్ట్ చేయక పోతే కేటాయించిన సీటు 23వ తేది నాటికి ఖాళీగా పరిగణించబడుతుందని డాక్టర్ నవ్య హెచ్చరించారు. మరోవైపు 23 నుండి ప్రారంభమయ్యే 2వ దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ కు అందుబాటులో ఉన్న సీటుగా చేర్చబడుతుందన్నారు. అన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు అభ్యర్థి కళాశాలలో నివేదించిన వెంటనే పోర్టల్‌లో చేరే వివరాలను అప్‌ డేట్ చేయాలని స్పష్టం చేసారు. కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా 23 నాటికి పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. (Story: ఇంజ‌నీరింగ్ అడ్మిష‌న్ల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న‌!)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version