Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఫేక్ వార్తలతో జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు 

ఫేక్ వార్తలతో జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు 

ఫేక్ వార్తలతో జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు 

ఎమ్మెల్యే నసీర్

న్యూస్‌తెలుగు/గుంటూరు : గుంటూరు నగరం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యుడు, నసీర్ మాట్లాడుతూ, జగన్ రెడ్డి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మా ప్రభుత్వం మీద అబద్ధాలు అసత్య ఆరోపణలు చేయడం వైసీపీ వారికి అజెండాగా మారిందన్నారు.
శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గిరిజన మహిళను వైసీపీ నేత విజయసాయిరెడ్డి వంచించిన విషయం సాక్షాధారంతో సహా బట్టబయలైనందువల్ల ఈ అంశాన్ని పక్కదారి పట్టించెందుకు, వినుకొండలో వైసీపీ కార్యకర్తల అంతర్గత వివాదాన్ని మా పార్టీపై నెట్టేందుకు జగన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. నిన్న పల్నాడు జిల్లా వినుకొండలో ఇద్దరు మైనార్టీ సోదరుల జిలాని, రషీద్ ల మధ్య జరిగిన వివాదంలో ఒకరు బలయితే దానిని కూడా తెలుగుదేశం పార్టీ పై నెట్టి,కుట్రలు చేస్తున్నారన్నారు. మృతుడు రషిదు హంతకుడు జిలాని వీరి ఇరువురు గతంలో వైసీపీ పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. గత ఏడాది తొలి ఏకాదశి రోజున వినుకొండలో వీరి మధ్య తలెత్తిన వివాదం అది అన్నారు. రషీద్ వల్ల వేధింపులకు గురవుతూ జిలాని హంతకుడుగా మారాడని వారిరువురు మధ్య ఉన్న గొడవలు వల్ల జరిగిన హత్యకు ఈ సంఘటనకు రాజకీయ రంగు పులవటం దుర్మార్గమన్నారు. జగన్ శవ రాజకీయాలు చేయటం వైసీపీ పార్టీ కార్యకర్తల మద్య వ్యక్తిగత వ్యవహారం. వినుకొండలో జరిగిన హత్య కారణమైతే, బెంగళూరు నుండి వినుకొండ కి హడావుడిగా వచ్చి ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం సరికాదన్నరు. అబద్ధాలు, అసత్యాలు, అవినీతి కలిపితే జగన్ రెడ్డి అన్న విషయం వినుకొండ సంఘటన ద్వారా మరోసారి స్పష్టమైనది అన్నారు. కర్నూలు జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం మరణానికి కారణం వైసీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు.
నరసరావుపేటలో మసీదు స్థలం కాపాడటానికి ప్రయత్నించిన మైనారిటీ నేత ఇబ్రహీంను నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన వైసీపీ నేతలను కాపాడింది తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కాదా అని గుర్తుచేశారు.
గడిచిన 5 ఏళ్ల పాలనలో సుమారు 18 మందికి పైగా మైనార్టీల సోదరులను హతమార్చి వారి ఆస్తులను వైసిపి నేతలు కబ్జా చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి వైసీపీ నేతలను పరిమితం చేశారని, అయినా జగన్ సైకో ప్రవర్తన మారలేదన్నారు. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డి అండ్ కో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. వైసీపీ నేతల కల్లబొల్లి మాటలు నమ్మొద్దు అని అన్నారు రాష్ట్ర ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చిట్టి బాబు పాల్గొన్నాడు. (Story : ఫేక్ వార్తలతో జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics