ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది :సిపిఐ
న్యూస్ తెలుగు/కొండమల్లేపల్లి :
ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి మండలంలోని చెన్నంనేనిపల్లి ,చింతకుంట్ల గ్రామాలలో సిపిఐ శాఖ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ సాధన వరకు జరిగిన విరోచిత పోరాటాల్లో ఎర్రజెండా సిపిఐ పార్టీ అగ్రభాగాములో నిలిచిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి పోరాడుతుంది ఎర్ర జెండానే అని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రకటనతో కాలయాపన చేయకుండా తక్షణమే కార్యచరణ చేపట్టాలని ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు.
అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి గుమ్మకొండ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ఇండ్లు లేని పేదలందరికీ వెంటనే ఇల్లు నిర్మించాలని, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.చెన్నమనేనిపల్లి గ్రామములో సిపిఐ పార్టీ జెండాను గ్రామ శాఖ కార్యదర్శి కత్తుల భిక్షమయ్య ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహయ కార్యదర్శి పీ శేఖరాచారి, కల్లు చరణ్ రెడ్డి, శ్రీనివాస్,ధర్మయ్య, నాగయ్య, లచ్చిరాం,టేకులపల్లి వెంకటయ్య,మధు,కాశయ్య, లక్షమయ్య,ఇద్దయ్య,మీనమ్మ,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది :సిపిఐ)