నగరంలో రోజు విడిచి రోజు నీరు పంపిణీ చేసేందుకు చర్యలు
నగరపాలక కమిషనర్ ఎం ఎం నాయుడు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం టౌన్ నగరంలో రోజు విడిచి రోజు నీటి పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. ఈ మేరకు ఈరోజు నెల్లిమర్ల హెడ్ వాటర్ వర్క్స్ ప్రాంతానికి చేరుకొని అక్కడ నీటి సామర్థ్యం, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం నీటి పంపిణీకి అవసరమైన అదనపు నీటిని ఆండ్ర నుండి రప్పించేందుకై జిల్లా కలెక్టర్ వారికి నివేదించారు. ఆండ్ర నుండి మూడు నాలుగు రోజుల్లో అదనపు నీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి పంపిణీకి అవసరమైన 16 ఎం.ఎల్.డి. నీరు అందుబాటులో ఉంది. అదనపు నీరు అందుబాటులోకి వచ్చినట్లయితే రానున్న 15 రోజుల తర్వాత కూడా యధా ప్రకారం రోజు విడిచి రోజు సకాలంలో నీటి పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కమిషనర్ ఎం ఎం నాయుడు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఈ కే శ్రీనివాసరావు, డిఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. (Story : నగరంలో రోజు విడిచి రోజు నీరు పంపిణీ చేసేందుకు చర్యలు)