Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

0

నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం
రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖా మంత్రి సంధ్యారాణి
ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

న్యూస్‌తెలుగు/విజయనగరం టౌన్ :
బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి భరోసా ఇచ్చారు. అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని ఘోషా ఆసుపత్రిలో ఆదివారం ఆమె పరామర్శించారు. బాలికకు అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. శిశువు కు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా అండగా ఉంటామని బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
అనంతరం మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు. చట్టపరంగా అందాల్సిన ఆర్థిక సాయాన్ని వెంటనే అందిస్తామన్నారు. నిందితుడిని వీలైనంత త్వరగా, కఠినంగా శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఐదు నెలల శిశువు పై అత్యాచారానికి ఒడిగట్టిన ఇటువంటి మానవ మృగాలకు, కనీసం బెయిల్ కూడా రాకుండా చూడాలని న్యాయవాదులకు ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బాలికలు, మహిళలందరికీ రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఆ దిశగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారని సంధ్యారాణి తెలిపారు. ఆమె వెంట ఐసిడిఎస్ పిడి బి.శాంతకుమారి, రామభద్రపురం తాసిల్దార్ సులోచనారాణి, ఒన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. బాధితురాలను పరామర్శించిన మంత్రి శ్రీనివాస్ అత్యాచారానికి గురైన శిశువు కుటుంబాన్ని గోశాసుపత్రిలో ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు బాలికకు అందిస్తున్న చికిత్స ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు బాధిత శిశువు కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఆదివారం బాధిత శిశువు పరామర్శించిన వారిలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి తదితర నేతలు ఉన్నారు. (Story : నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version